రానా చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రియమణి?

‘ఎవరే అతగాడు’ అనే చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ప్రియమణి. ప్రముఖ నిర్మాత నిర్మాత కె.ఎస్.రామారావు కొడుకు హీరోగా రూపొందిన ఈ చిత్రం వచ్చి వెళ్లినట్టు కూడా చాలా మందికి తెలీదు. కాబట్టి ప్రియమణి ఈ చిత్రంలో నటించిందని ఎవరూ గుర్తించలేదు. ఇక జగపతిబాబు తో చేసిన ‘పెళ్ళైన కొత్తలో’ చిత్రంతో ప్రేక్షకులని అలరించింది. తరువాత ‘యమదొంగ’ ‘గోలీమార్’ ‘శంభో శివశంబో” ‘రగడ’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే వీటిలో ఒక్క ‘యమదొంగ’ తప్ప మరే చిత్రం కూడా పెద్ద విజయం సాధించలేదు. దీంతో ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో పెళ్ళి చేసుకుని సెటిలయ్యింది. 2017 ఆగష్టు 23 న ముస్తఫా రాజ్ ను వివాహం చేసుకుని సినిమాలకి బ్రేక్ ఇచ్చింది.

ఇప్పటి వరకూ తెలుగులో ప్రసారమయ్యే ‘ఢీ’ షో లో జడ్జిగా వ్యవహరిస్తూ వచ్చింది. ఇక తాజా సమాచారం ప్రకారం.. త్వరలోనే ప్రియమణి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుందట. వేణు ఊడుగుల డైరెక్షన్లో రానా హీరోగా ఓ భారీ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘విరాటపర్వం 1992’ అనే టైటిల్ ను ఈ చిత్రం కోసం అనుకుంటున్నారు. ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్ గా నటించనుండగా… ఓ కీలకమైన పాత్ర కోసం ‘టబు’ను తీసుకున్నారని టాక్ నడుస్తుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ముఖ్యమైన పాత్రకోసం ప్రియమణిని తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈమె పాత్ర సినిమాకే హైలెట్ గా నిలుస్తుందట. మరి ఈ చిత్రంతో అయినా ప్రియమణి మళ్ళీ టాలీవుడ్లో బిజీ అవుతుందేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus