షూటింగ్లో గాయపడ్డ హీరోయిన్ రాయ్ లక్ష్మీ..!

ప్రముఖ హీరోయిన్ రాయ్ లక్ష్మీ ప్రమాదానికి గురవ్వడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లోని బంజారా హిల్స్ లో ఈమె ఓ సినిమా షూటింగ్లో పాల్గొంటూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు స్పష్టమవుతుంది.ఓ యాక్షన్ సెక్వెన్స్ లో రాయ్ లక్ష్మీ పాల్గొంటూ ఉండగా.. కాలు అదుపు తప్పడంతో బ్యాలన్స్ చేసుకోలేక ఆమె కింద పడిపోయిందని తెలుస్తోంది. ఆమె కాలికి చిన్నపాటి గాయాలు అయ్యాయి. వెంటనే షూటింగ్ కు ప్యాకప్ చెప్పేసి..

ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లారట సిబ్బంది. ఈ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్లు కామెంట్లు పెడుతున్నారు. శ్రీకాంత్ హీరోగా నటించిన ‘కాంచనమాల కేబుల్ టీవీ’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాయ్ లక్ష్మీ ఆ తరువాత బాలకృష్ణ తో ‘అధినాయకుడు’, లారెన్స్ తో ‘కాంచన’ వంటి సినిమాల్లో నటించింది.అయినప్పటికీ ఈమెకు ఆశించిన స్థాయిలో బ్రేక్ రాలేదు.

దాంతో ‘బలుపు’ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రాలలో ఐటెం సాంగ్స్ చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఇక అటు పై బాలీవుడ్ వైపు వెళ్ళి ‘జూలీ’ అనే బోల్డ్ చిత్రం చేసింది.ఆ చిత్రంలో ఓ రేంజ్ గ్లామర్ షో చేసినా ఈమెకు ఆశించిన బ్రేక్ రాలేదు. దాంతో మళ్ళీ టాలీవడ్ కు వచ్చి ‘వేర్ ఈజ్ ది వెంకట లక్ష్మీ’ చిత్రం చేసింది. అది కూడా హిట్ అవ్వలేదు.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus