Actress Raasi: సీనియర్ హీరోయిన్ రాశికి ఆ స్టార్ హీరో అంటే చాలా ఇష్టమట..కానీ!

సీనియర్ స్టార్ హీరోయిన్ రాశి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన రాశి.. తర్వాత తెలుగుతో పాటు తమిళ,మలయాళం,కన్నడ భాషల్లో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ‘పెళ్లి పందిరి’ ‘గోకులంలో సీత’ ‘శుభాకాంక్షలు’ ‘మనసిచ్చి చూడు’ ‘ప్రేయసి రావే’ ‘స్నేహితులు’ వంటి హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఓ పక్క ఇల్లాలి పాత్రలు చేస్తూనే మరోపక్క గ్లామర్ రోల్స్ కూడా చేస్తూ వచ్చింది రాశి.’స్నేహితులు’ సినిమాలో ఈమె ఇంటిమేట్ సీన్లో కూడా నటించింది… అటు తర్వాత మోహన్ బాబు హీరోగా నటించిన ‘పోస్ట్ మాన్’ చిత్రంలో ఓ సీన్ డిమాండ్ చేయడం వలన నగ్నంగా కూడా నటించింది.

అప్పట్లో ఆ సీన్ తొలగించాలని మహిళా సంఘాలు పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి.ఇక ‘నిజం’ సినిమాలో కూడా ఈమె పాత్రకు గాను ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. అయితే కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో ఈమెకు అవకాశాలు తగ్గుముఖం పడుతూ వచ్చాయి.దాంతో ఈమె ఏమాత్రం డిలే చేయకుండా పెళ్లి చేసుకుని సినిమాలను తగ్గించింది. ‘రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నప్పుడే మనం రిటైర్మెంట్ తీసుకోవడం మంచిదని’ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రాశీ. ప్రస్తుతం ఈమె టీవీ సీరియల్స్ తో పాటు పలు సినిమాల్లో కూడా తల్లి పాత్రలు చేస్తుంది. వాటికి ఈమె పెద్దగా ఫీలవ్వడం లేదట. కానీ ఓ స్టార్ హీరో సరసన నటించాలని చాలా కోరిక ఉండేదట.

ఆ స్టార్ అంటే ఈమెకు చాలా ఇష్టమట. అతని సినిమాలో నటించకుండానే ఇలాంటి పాత్రల్లో నటిస్తుండడం.. తలుచుకున్నప్పుడల్లా కొంత బాధగా ఉంటుందని ఈమె తెలిపింది. రాశికి ఇష్టమైన స్టార్ హీరో మరెవరో కాదు.. విక్టరీ వెంకటేష్. ఇతని సినిమాల్లో నటించాలని మొదట ఆడిషన్స్ కు వెళ్ళేదట రాశి. కానీ ఈమెను ఆ చిత్రాలకు ఎంపిక చేసుకోలేదని చెప్పుకొచ్చింది. ఇక స్టార్ డం వచ్చిన తర్వాత అయినా ఆయన సినిమాల్లో అవకాశాలు వస్తాయని ఆశించినా.. అది నెరవేరలేదు అంటూ రాశి చెప్పుకొచ్చింది. అయితే ‘శీను’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో వెంకటేష్ తో కలిసి చిందులేసి సరిపెట్టుకోవాల్సి వచ్చిందని రాశి తెలిపింది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus