Rashmika: రష్మిక మందనా ఎమోషనల్ పోస్ట్!

కన్నడ బ్యూటీ రష్మిక మందనా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ఆమెకి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం తెలుగు, తమిళంతో పాటు ఈ ముద్దుగుమ్మ హిందీలో కూడా దుమ్ములేపుతోంది. ఇప్పటికే ‘మిషన్ మజ్ను’ సినిమాను పూర్తి చేయగా.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండో ప్రాజెక్ట్ గా ‘గుడ్ బై’ సినిమాలో నటించింది.

రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ఈ సందర్భంగా యూనిట్ కి కృతజ్ఞతలు చెబుతూ.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది రష్మిక. ‘గుడ్ బై’ సినిమాకి గుడ్ బై చెప్పడం తనకు ఇష్టం లేదంటూ రాసుకొచ్చింది. ‘గుడ్ బై’ సినిమా షూటింగ్ పూర్తయిందని.. రెండేళ్లుగా కోవిడ్ తో పాటు ఏదీ కూడా తమను పార్టీ చేసుకోకుండా అడ్డుకోలేకపోయిందంటూ ఆనందం వ్యక్తం చేసింది.

 

ఈ సినిమా చాలా ఫన్ గా ఉంటుందని.. ఈ సినిమా కోసం తాను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. ప్రపంచంలోనే అమితాబ్ బచ్చన్ సినిమా చేసే అవకాశం రావడం తనకు గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది రష్మిక. తనకు ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు వికాస్ బహల్ కు థాంక్స్ చెప్పింది ఈ బ్యూటీ. తనను ఈ సినిమాలో ఎందుకు తీసుకున్నారో దేవుడికే తెలియాలని రాసుకొచ్చింది.

ఆయన గర్వించేలా తాను నటించానని అనుకుంటున్నానని పేర్కొంది. సినిమా చూడడానికి అందరూ రెడీగా ఉండాలని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈమె తెలుగులో ‘సీతారామం’ అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో దుల్కర్ హీరోగా నటిస్తుండగా.. రష్మిక ముస్లిం యువతిగా కనిపించనుంది. అలానే ‘పుష్ప2’ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus