ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో రష్మిక మందన్న ఒకరు. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈమె అతి తక్కువ సమయంలోనే ఇతర భాషలలో కూడా సినిమా అవకాశాలను అందుకొని వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. అయితే కొన్నిసార్లు సోషల్ మీడియా వేదికగా ఈమె చేస్తే పోస్టులు పలు చర్చలకు కారణం కాగా మరికొన్ని సార్లు వివాదానికి కారణం అవుతుంటాయి.
అయితే సోషల్ మీడియా వేదికగా ఈమె తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా తన గురించి తన ఇంట్లో పనివాళ్ల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ చిన్న చిన్న విషయాలను కూడా తాను ఎంతో కీలకంగా తీసుకుంటానని తెలిపారు.. మాటలకు నిజంగా చాలా శక్తి ఉంది ఒక మనిషి మనసు విరి చేయడానికి ఒక్క మాట చాలని అందుకే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని ఈమె తెలిపారు.
ఇక నేను నా జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని చిన్న సంఘటనను కూడా డైరీలో రాసుకుంటాను. ఇంటికి వచ్చిన తర్వాత గౌరవంతో ప్రతి ఒక్కరి పాదాలను టచ్ చేస్తానని ఈమె తెలియజేశారు. తన ఇంట్లో పని చేసే పని వాళ్లకు ప్రతిరోజు ఇంటికి రాగానే కాళ్లు మొక్కుతానని రష్మిక తెలియజేశారు. నాకు మనుషుల్ని వేరు చేసి చూడటం రాదు అందుకే ఇలా చేస్తున్నానని తెలిపారు.
తనకు మనిషిగా సాటి మనుషులను గౌరవించడమే తెలుసు అంటూ ఈ సందర్భంగా రష్మిక ప్రతిరోజు తన ఇంట్లో పని వాళ్లకు కూడా కాళ్లకు నమస్కరిస్తాను అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె చేసిన ఈ కామెంట్లపై పలువురు తమదైన శైలిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?