Rashmika: రష్మిక మందన చేతిలో వరుస సినిమాలు… తిరిగి ఓల్డ్‌ ఫామ్‌లోకి వచ్చినట్లేనా?

బాలీవుడ్‌కి వెళ్లిపోయింది… ఇక టాలీవుడ్‌లో సినిమాలు చేయదు అని కొందరు అంటే… ఇక్కడ అవకాశాలు తగ్గిపోవడం వల్లే అక్కడకు వెళ్లిపోయింది అన్నారు. రష్మిక సినిమాలు అన్నీ ఇంకో కుర్ర హీరోయిన్‌ కొట్టేస్తోంది అని కామెంట్లు చేశారు. అయితే ఇవన్నీ గతం… ఇప్పుడు రష్మిక చేతిలో అరడజను సినిమాలు వరకు ఉన్నాయి. కావాలంటే లిస్ట్‌ ఓసారి రెడీ చేసి చూసుకోండి నేషనల్‌ క్రష్‌ సినిమాల లైనప్‌ ఎంత బలంగా ఉందో తెలుస్తుంది.

‘కిర్రాక్ పార్టీ’ అనే కన్నడ సినిమాతో సినిమాల్లోకి వచ్చింది రష్మిక మందన. ఆ తర్వాత తెలుగులోకి ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చింది. తొలి సినిమాతోనే స్టార్‌ హీరోయిన్‌ అయ్యే అన్ని లక్షణాలు ఉన్నాయి అని అనిపించుకుంది. ఆ తర్వాత అనతి కాలంలో స్టార్‌ హీరోలతో నటించి స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. కానీ బాలీవుడ్‌ వైపు వెళ్లి వరుస సినిమాలు ఓకే చేసింది. అయితే ఇప్పుడు అక్కడ ఏదీ కలసి రావడం లేదు. దీంతో రష్మిక పని అయిపోయింది అని అంటున్నారు.

‘పుష్ప: ది రైజ్‌’ సినిమాతో పాన్‌ ఇండియా హీరోయిన్‌ ఇమేజ్‌ను సంపాదించుకుంది. అయితే ఆ తర్వాత ఆ సినిమా తర్వాత తెలుగులో వరుస సినిమాలు ఓకే చేయలేదు. దీంతో ఆమె స్థానంలో ఇతర హీరోయిన్లు వచ్చేశారు. నితిన్‌ – వెంకీ కుడుమల సినిమాలో రష్మికనే తీసుకున్నారు. కానీ ఆమె ఆ సినిమా నుండి తప్పుకుంది. కారణాలు తెలియవు కానీ తప్పుకుంది అనేది విషయం. ఇది కాకుండా మరికొన్ని సినిమాలు వదులుకుంది. అయితే ఇప్పుడు మళ్లీ ఊపు మీద ఉంది రష్మిక. ప్రస్తుతం రష్మిక లైనప్‌లో ‘పుష్ప: ది రూల్‌’ సినిమా ఉంది.

ఇది కాకుండా విజయ్ దేవరకొండ – గౌతమ్‌ తిన్ననూరి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో రష్మికనే హీరోయిన్‌. తొలుత ఈ పాత్ర శ్రీలీలకు వచ్చింది. ఆ విషయం పక్కనపెడితే ధ‌నుష్, శేఖ‌ర్ క‌మ్ముల కాంబోలో రూపొందుతోన్న చిత్రంలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌. ‘రెయిన్‌ బో’ అనే హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలోనూ నటిస్తోంది. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రష్మిక నటిస్తోందని సమాచారం. దీంతోపాటు రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో రూపొందిన ‘యానిమల్’ సినిమాలో నటిస్తోంది. ఈ లెక్కన నేషనల్‌ క్రష్‌ (Rashmika) చాలా బిజీ అని చెప్పాలి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus