నటిగా కంటే పవన్ కళ్యాణ్ భార్యగా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న రేణు కొన్నేళ్ల క్రితం అతడి నుండి విడిపోయి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బిజీ అవుతోంది. ఇదిలా ఉండగా.. ఈమెపై ఓ వెబ్ సైట్ తప్పుడు కథనాలు రాయడంతో రేణుకి చిర్రెత్తుకొచ్చింది. వ్యూస్ కోసం, తన బిజినెస్ కోసం తప్పుడు వార్తలని ప్రసారం చేస్తున్నారని.. ఇలాంటి వెబ్ సైట్లను ప్రోత్సహించొద్దంటూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టింది రేణు. ‘పవన్ మాజీ భార్యకు కరోనా పాజిటివ్.. కానీ!’ అంటూ ఒక వెబ్ సైట్ లో ఆర్టికల్ వచ్చింది.
ఇది ఫేక్ వార్త కావడంతో రేణు ఫైర్ అయింది. తనకు కరోనా నెగటివ్ వచ్చిన రిపోర్ట్ ని షేర్ చేస్తూ సదరు వెబ్ సైట్ ని ఏకిపారేసింది. దయచేసి ఇలాంటి తప్పుడు కథనాలను ప్రసారం చేసే స్టుపిడ్ వెబ్ సైట్ ని ఫాలో కావొద్దు అంటూ అభిమానులను కోరింది. సదరు వెబ్ సైట్ ట్విట్టర్ లో కూడా తప్పుడు కథనాలనే పోస్ట్ చేస్తుందని.. అబద్దపు వార్తలతో మనుగడ సాగిస్తున్నారంటూ ఓ రేంజ్ లో మండిపడింది.
ఇలాంటి స్టుపిడ్స్ సెలబ్రిటీల గురించి అబద్దాలు చెప్పి.. ఫాలోవర్లను పెంచుకుంటున్నారని.. నిజాయితీగా పని చేయరని పేర్కొంది. అభిమానులు ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే.. అఫీషియల్ ఖాతాలు ఉన్నాయని.. వాటి ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చని చెప్పారు. గతంలో పవన్ కళ్యాణ్ ఆస్తుల గురించి కూడా తప్పుడు కథనాలు ప్రసారం కావడాన్ని ఖండిస్తూ వెబ్ సైట్స్ పై ఫైర్ అయ్యారు.