‘నేను కష్టంలో ఉన్నారు. ఓ వెయ్యి రూపాయలు ఉంటే పంపు’.. ఇలాంటి మెసేజ్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో సర్వసాధారణమైపోయాయి. ఎవరు, ఎందుకు ఇలాంటి పోస్టులు పెడుతున్నారు అనే విషయంలో చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి. కొన్ని వాళ్లే నిజంగా పెడుతున్నా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఫేస్‌బుక్, ఎక్స్ (మాజీ ట్విటర్), ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను హ్యాక్ చేసి, లేదంటే డూప్లికేట్ అకౌంట్స్ క్రియేట్ చేసి అలాంటి పోస్టులు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు.
ఇప్పుడు ఇదంతా చర్చలోకి ఎందుకు వచ్చింది అంటే.. ఇలాంటి పోస్టే పెట్టారు రేణు దేశాయ్ (Renu Desai) . ఇటీవల ఆమె తనకు ఒక్కొక్కరు రూ. 3500 పంపండి అని ఆమె ఓ పోస్టు పెట్టారు. జంతు సంరక్షణ కోసం రూ.3500 విరాళంగా ఇవ్వాలంటూ ఇన్‌స్టా వేదికగా ఆమె పెట్టిన పోస్ట్ మీరూ చూసే ఉంటారు. దీంతో చాలామంది రేణు ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అయిందని అనుకున్నారు. మరికొందరు లైట్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెనే ఓ క్లారిటీ పోస్టు పెట్టారు.
తన బ్యాంకు ఖాతా ఏమీ హ్యాక్ అవలేదని, తానే డొనేషన్ కోసం పిలుపు ఇచ్చానని, ఖాతా వివరాలు షేర్ చేశానని చెప్పారు. ఈ మేరకు రేణు దేశాయ్ వీడియో విడుదల చేశారు. తాను ఆ పోస్ట్ పెట్టడం వెనుక కారణాన్ని వివరించారు. కొన్ని రోజుల కిందట నాకు ఫుడ్ పాయిజన్ అయింది. అందుకే హెల్త్ బాగోలేక వీడియోలు చేయడం లేదు. ఇప్పుడు రూ.3500 కోసం రిక్వెస్ట్ నేనే పెట్టాను. జంతు సంరక్షణ కోసం రెగ్యులర్‌గా విరాళాలు ఇస్తూ ఉంటాను.
అయితే ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బు ఇచ్చేస్తే, నా కోసం, నా పిల్లలకు ఏమీ మిగలదు. చిన్నారుల కోసం, సంరక్షణ అవసరమైన కుక్కలు, పిల్లులు, ఆవులకు సాయం చేస్తున్నాను అని చెప్పారు రేణు.త్వరలో వాళ్ల కోసం, వాటి కోసం షెల్టర్ కట్టించేందుకు ప్రయత్నిస్తున్నాను. అప్పుడు అధికారికంగా మీ నుంచి విరాళాలు అడుగుతాను. మీరు పంపిన డబ్బులతో ఏర్పాటు చేసిన ఆహారానికి సంబంధించిన వివరాలను త్వరలోనే షేర్ చేస్తాను అని చెప్పారు రేణు దేశాయ్.