Roja Hospitalized: రోజాకి అస్వస్థత.. చెన్నై హాస్పిటల్ లో చికిత్స!

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అయిన ఆర్.కె రోజా అనారోగ్యంతో హాస్పిటల్లో చేరినట్టు తెలుస్తుంది. దీంతో ఈ న్యూస్ కొద్దిసేపటికే వైరల్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.జూన్ 10న అంటే శనివారం నాడు రాత్రి చెన్నైలోని క్రిమ్స్ రోడ్లోని అపోలో హాస్పిటల్ లో రోజాని అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు కుటుంబ సభ్యులు. అందుకు గల కారణం ఏంటని ఆరా తీయగా .. కొద్ది రోజుల క్రితం ఆమెకు కాలు బెణకడంతో వారం రోజుల పాటు ఫిజియోథెరపీ చేయించారట. అయినా నొప్పి ఎక్కువ కావడంతో చెన్నె.. థౌజండ్ లైట్స్లో ఉన్న అపోలో హాస్పిటల్లో చేర్పించినట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం రోజా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందట.డాక్టర్లు మెరుగైన చికిత్స అందిస్తున్నారు.కాలి నొప్పి నుండి కూడా ఆమెకు రిలీఫ్ దొరికింది అని ఆమె చెప్పినట్టు వైద్యులు తెలిపారు. త్వరలోనే రోజాని డిశ్చార్జ్ చేయబోతున్నట్టు కూడా వైద్యులు ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే ఆమె 10 రోజుల పాటు నియోజకవర్గ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని పార్టీ నేతలు చెప్పినట్లు సమాచారం.

మంత్రి అయిన తర్వాత రోజా.. సినిమాలను తగ్గించారు. అయితే అప్పుడప్పుడు బుల్లితెరపై షోలలో కనిపిస్తూ వస్తున్నారు. అప్పుడప్పుడు రోజా .. జనసేన పార్టీ పై, అలాగే ఆ పార్టీ అధినేత, హీరో అయిన పవన్ కళ్యాణ్ పై నెగిటివ్ కామెంట్లు చేస్తూ ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు. మెగా బ్రదర్ నాగబాబు కూడా ఓసారి ఈమె పై ఓ రేంజ్లో ఫైర్ అయిన సంగతి తెలిసిందే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus