Sadaa, Uday Kiran: ఉదయ్ కిరణ్ మృతిపై సదా కామెంట్స్ వైరల్!

  • August 22, 2022 / 04:22 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల ద్వారా పాపులర్ అయిన హీరోయిన్లలో సదా ఒకరనే సంగతి తెలిసిందే. ఒకవైపు స్టార్ హీరోలతో మరోవైపు యంగ్ హీరోలకు జోడీగా నటించి సదా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. గ్లామరస్ రోల్స్ కంటే అభినయ ప్రధాన పాత్రలకే ఆమె ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు. తాజాగా సదా ఉదయ్ కిరణ్ మృతి గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉదయ్ కిరణ్ కెరీర్ తొలినాళ్లలో సంచలన విజయాలను అందుకున్నారు.

వరుస విజయాలతో లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకోవడంతో పాటు తన నటనతో ఉదయ్ కిరణ్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకున్నారనే వార్త విని అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. అటు ప్రొఫెషనల్ గా ఇటు వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదురుకావడం వల్లే ఉదయ్ కిరణ్ మృతి చెందారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఉదయ్ కిరణ్ తో కలిసి ఔనన్నా కాదన్నా సినిమాలో సదా నటించారు. అయితే ఔనన్నా కాదన్నా సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు.

సదా మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ చనిపోవాలని నిర్ణయం తీసుకుంటాడని నేను అనుకోలేదని ఆమె అన్నారు. మంచి నటుడైన ఉదయ్ కిరణ్ ను కోల్పోవడం దురదృష్టమని ఆమె వెల్లడించారు. ఉదయ్ కిరణ్ ఎంతో మంచి వ్యక్తి అని ఉదయ్ కిరణ్ కెరీర్ లో ఎక్కడ తప్పు జరిగిందో తెలియదని సదా తెలిపారు. ఉదయ్ కిరణ్ లైఫ్ లో ఏం జరిగినా చనిపోవాలని తీసుకున్న నిర్ణయం మాత్రం సరికాదని ఆమె చెప్పుకొచ్చారు.

కొన్నిసార్లు సినిమా ఆఫర్లు వస్తాయని కొన్నిసార్లు రావని అయితే వీటికంటే జీవితం ముఖ్యమని ఆమె అన్నారు. లైఫ్ తో నిత్యం పోరాడుతూ ఉండాలని సమస్య వచ్చిన సమయంలో చావే పరిష్కారం కాదని ఆమె చెప్పుకొచ్చారు. సదా చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus