Sadha: కాబోయే భర్త అలా ఉండాలన్న సదా.. కానీ?

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన సదా జయం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమై ఆ సినిమాతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఆ తర్వాత సదా పలువురు స్టార్ హీరోలకు జోడీగా నటించినా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయి. అయితే ఈ హీరోయిన్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదనే సంగతి తెలిసిందే. తాజాగా సదా పెళ్లి గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన సమయంలో చాలామంది పెళ్లి చేసుకోవాలంటూ ఉచిత సలహాలు ఇచ్చారని ఆమె అన్నారు.

మన లైఫ్ మీద కామెంట్లు చేసే హక్కును వాళ్లకు ఎవరిచ్చారని సదా ప్రశ్నించారు. అలాంటి వాళ్లకు నేను ఎందుకు సమాధానం చెప్పాలని ఆమె అన్నారు. ప్రస్తుతం పది జంటలకు పెళ్లైతే పెళ్లి తర్వాత కనీసం 5 జంటలైనా సంతోషంగా ఉన్నాయా అని ఆమె ప్రశ్నించారు. పెళ్లి తర్వాత ఎవరూ సంతోషంగా ఉండటం లేదని సదా కామెంట్లు చేశారు. నా లైఫ్ ను నేను సంతోషంగా గడపాలని అనుకుంటున్నానని సదా చెప్పుకొచ్చారు.

నేను పార్టీలకు, పబ్స్ కు వెళ్లనని ఆమె కామెంట్లు చేశారు. ఆల్కహాల్, నైట్ ఔట్స్ చేయనని ఆమె వెల్లడించారు. ఒక వ్యక్తిపై ఆధారపడి మ్యారేజ్ చేసుకుంటే సంతోషంగా ఉండలేరని సదా అన్నారు. ఎవరో నన్ను సంతోషంగా ఉంచాలని ఎందుకు అనుకోవాలని ఆమె ప్రశ్నించారు. నీ సంతోషం కొరకు నువ్వు మరో వ్యక్తిపై ఆధారపడాల్సిన అవసరం ఏముందని ఆమె అన్నారు.

నీ ఒత్తిడి కూడా అతనే భరించాలని ఆమె అన్నారు. నేను పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి వెజిటేరియన్ అయ్యి ఉండాలని ఆమె కామెంట్లు చేశారు. అతను ధనవంతుడు కాకపోయినా పరవాలేదని ఒకరిపై ఆధారపడకూడదని ఆమె తెలిపారు. ముఖ్యంగా నా సంపాదనపై అతను ఆధారపడకూడదని అలాంటి వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటానని అమె చెప్పుకొచ్చారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus