Sadha: ఎంత ప్రయత్నించినా కన్నీళ్లు ఆగలేదు… నటి సదా ఎమోషనల్ కామెంట్స్!

జయం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి నటి సదా ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా మారిపోయారు. అయితే ప్రస్తుతం ఈమె సినిమాలకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ బుల్లితెరపై ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక సదా పలు డాన్స్ షోలకు న్యాయ నిర్ణయితగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇలా సినిమాలపరంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి సదా తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు.

అయితే ఈ వీడియోలో ఈమె ఎంతో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.తాను ఎంత ప్రయత్నించినా ఈ కన్నీళ్లను ఆపుకోలేకపోతున్నానని ఈమె ఈ వీడియోలో చెప్పుకొచ్చారు. ఇంతలా సద కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే… సదా ఒకవైపు ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు ముంబైలో ఎర్త్ లింగ్స్ పేరిట రెస్టారెంట్ ప్రారంభించారు. అయితే 2019 ఏప్రిల్ 23వ తేదీ ఈ రెస్టారెంట్ ప్రారంభించారని తెలియజేశారు.

ఈ రెస్టారెంట్ ప్రారంభించక ముందు ఇక్కడంతా చాలా దయనీయ స్థితిలో ఉండేది అయితే ఈ రెస్టారెంట్ కోసం ఈ ప్రదేశాన్ని చాలా అందంగా తీర్చిదిద్దుకున్నానని తెలిపారు.ఇలా కరోనా సమయంలో రెస్టారెంట్ కు ఎవరు రాకపోయినా ఎక్కువ సమయం తాను అక్కడే గడుపుతూ రెస్టారెంట్ ను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుకున్నానని తెలిపారు. ఇప్పుడు తన రెస్టారెంట్ చాలా బాగా కొనసాగుతుంది అయితే ఈ ల్యాండ్ ఓనర్ నుంచి తనకు అనుకొని షాక్ తగిలిందని సదా తెలియజేశారు.

2023 ఏప్రిల్ 23వ తేదీన ల్యాండ్ ఓనర్ తనకు ఫోన్ చేసి ఈ రెస్టారెంట్ కాలి చేయమని చెప్పారట.అందుకు తనకు ఒక నెల రోజులు గడువు ఇచ్చారని ఈ వీడియోలో తెలియచేశారు.ఈ రెస్టారెంట్ తన ఫస్ట్ ప్రారంభించిన బిజినెస్ అని దీనిపై తనకు ఎంతో మమకారం ఉందని తెలిపారు.అయితే సడన్ గా ఈ రెస్టారెంట్ మూసేయాలి అంటే తనకు చాలా బాధగా ఉందని రెస్టారెంట్ వదిలి వెళ్లాలని లేదు అంటూ ((Sadha) ఈమె ఎమోషనల్ అవుతూ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది.


రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus