Sadha, Avinash: కమెడియన్ అవినాష్ పర్ఫామెన్స్ కు ఫిదా అయినా సదా.. వీడియో వైరల్!

బుల్లి తెరపై సీరియల్స్ మాత్రమే కాకుండా ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే స్టార్ మా లో బిబి జోడి అనే డాన్స్ షో ప్రసారమవుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ డాన్స్ షో కార్యక్రమానికి బిగ్ బాస్ కంటెస్టెంట్లు జోడీలుగా ఏర్పడి తమ అద్భుతమైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ కార్యక్రమానికి అద్భుతమైన రేటింగ్ రావడంతో మరింత ముందుకు తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో నిర్వాహకులు కంటెస్టెంట్లు కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ లో చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ముక్కు అవినాష్ చేసినటువంటి డాన్స్ పెర్ఫార్మెన్స్ కు నటి సదా ఎమోషనల్ అవుతూ ఏకంగా తన కాళ్లు మొక్కే ప్రయత్నం చేశారు. సమాజంలో హిజ్రాలకు ఎలాంటి ప్రాధాన్యత ఉందో మనకు తెలిసిందే. వారు ఎక్కడ కనిపించిన వారిని చాలా చులకనగా చూస్తూ ఉంటారు. ఈ విధంగా హిజ్రాలకు సమాజం ఎలాంటి గౌరవాన్ని ఇస్తుంది

వారు ఎలాంటి బాధలు అనుభవిస్తున్నారనే విషయాలను అవినాష్ తన పర్ఫామెన్స్ ద్వారా ఎంతో అద్భుతంగా చూపించారు. ఈ విధంగా హిజ్రాల ఆవేదనను ఒక డాన్స్ పెర్ఫార్మెన్స్ రూపంలో అవినాష్ తెలియజేయడంతో ఈయన పెర్ఫార్మెన్స్ కు సదా ఫిదా అయ్యారు. ఇలా పెర్ఫార్మెన్స్ అనంతరం సదా మాట్లాడుతూ ఇప్పటివరకు తాను ఇలాంటి పర్ఫామెన్స్ ఎక్కడ చూడలేదని తెలిపారు.

కళ్ళకు కట్టినట్టు హిజ్రాల బాధలను తెలియజేశావు హాట్సాఫ్ అంటూ ఏకంగా స్టేజ్ మీదకు వెళ్లి ఆయన కాళ్లు నమస్కరించడానికి కిందికి వంగడంతో అవినాష్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus