తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత గత కొంతకాలంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ తన వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు పడుతున్నారు. విడాకుల విషయం నుంచి బయటపడిన సమంత తిరిగి ఇండస్ట్రీలో నిలదొక్కుకోగా అనంతరం ఈమె మహిమయోసైటిస్ వ్యాధి బారిన పడ్డారు. ఇలా ఈ వ్యాధితో ఎంతో సతమతమైన సమంత ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు.
అయితే ఈ మయోసైటిసిస్ వ్యాధి బారిన పడటంతో ఈమె తాను కమిట్ అయిన సినిమాలకు దూరమయ్యారు.అయితే ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటూ ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా తిరిగి కోలుకున్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. సమంత కోలుకోవడంతో తిరిగి ఈమె సిటాడెల్ వెబ్ సిరీస్ తో పాటు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ లో కూడా పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
ఇలా తిరిగి తన సినిమాలతో బిజీ అయినటువంటి సమంత సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా మారిపోయారు. ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈమె తరచూ మోటివేషనల్ కొటేషన్స్ షేర్ చేస్తూ అందరిలో స్ఫూర్తిని నింపుతూ ఉంటారు. తాజాగా అమ్మవారి ఫోటో ముందు ఆధ్యాత్మిక చింతనలో లీనమై ఉన్నటువంటి ఫోటోలు షేర్ చేస్తూ ఈమె నమ్మకం గురించి హితబోధ చేస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.
కొన్నిసార్లు, ఇది మానవాతీత బలంగా తీసుకోలేం. విశ్వాసమే మిమ్మల్ని ముందుకు తీసుకువెళుతుంది. విశ్వాసం మిమ్మల్ని ప్రశాంతంగానూ ఉంచుతుంది. విశ్వాసం మీ గురువుగా… మీ స్నేహితునిగా మారుతుంది. విశ్వాసం మిమ్మల్ని మానవాతీతంగా చేస్తుందని పేర్కొంది. ఇలా సమంత చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!
2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్