Samyuktha Menon: ప్రేమించిన వ్యక్తితో పెళ్లికి సిద్ధమైన సంయుక్త?

  • January 2, 2024 / 10:35 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సంయుక్త మీనన్ ఒకరు. ఈమె తెలుగులో మొదటగా బింబిసారా సినిమాలో నటించినప్పటికీ ఈమె నటించిన భీమ్లా నాయక్ సినిమా మాత్రం ముందుగా విడుదల అయింది. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం బింబిసారా సినిమా ద్వారా మరో హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈమె సార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని అందుకున్నారు.

ఇక ఇటీవల కళ్యాణ్ రామ్ తో మరోసారి డెవిల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది ఇలా వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్నటువంటి ఈమె గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఈమె కోలీవుడ్ ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్నటువంటి ఒక హీరోతో పెళ్లికి సిద్ధమైంది అంటూ గతంలో వార్తలు వచ్చాయి అయితే అవన్నీ కేవలం రూమర్స్ అని తేలిపోయింది.

అయితే ఈమె (Samyuktha Menon) ఒక వ్యక్తితో గత కొన్ని సంవత్సరాలుగా డేటింగ్ లో ఉన్నారని, ఆ వ్యక్తిని ఈమె పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా తన స్నేహితుడితో డేటింగ్ లో ఉన్నటువంటి ఏడాది చివరిలో పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తుంది. మరి ఈమె పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సింది. అయితే ఈమె కెరీర్ ఇప్పుడు మంచి పీక్ స్టేజ్లో ఉంది ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకుంటే తన కెరియర్ ఆ ప్రభావం పడుతుందని అభిమానులు భావిస్తున్నారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus