తన పెళ్లి గురించి ఓపెన్ అయిన ప్రముఖ నటి

హీరోయిన్లు సినిమాల్లో హీరోకి ఈజీగా ప్రేమలో పడతారు… శుభం కార్డు పడే ముందు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతారు. కానీ నిజజీవితంలో మాత్రం అలా చేయరు. వాళ్లకు మంచి క్రేజ్ ఉన్నంత వరకు సినిమాల్లో అవకాశాలు వస్తున్నంత వరకు.. పెళ్లి జోలికి వెళ్ళరు. ఎప్పుడైతే అవకాశాలు తగ్గిపోతాయో అప్పుడు పెళ్ళికి రెడీ అవుతారు. మరి ఆ టైంలో ప్రేమ పెళ్లి చేసుకుంటారా? పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారా? అన్నది వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు.

కానీ వాళ్ళు ఫేమ్ లో ఉన్నన్ని రోజులు పెళ్లి గురించి మాట్లాడితే.. ఏదో ఒకటి చెప్పి దాటేస్తూ ఉంటారు. కానీ హీరోయిన్ సంయుక్త మీనన్ మాత్రం మరోసారి ఇలాంటి ప్రశ్నలు రాకుండా పెళ్లి అవసరమా అనేసింది. ఆమె మాట్లాడుతూ.. “పెళ్ళి చేసుకోవాలంటే నా ఆలోచనలకు తగ్గ వ్యక్తి దొరకాలి. నన్ను ప్రేమగా చూసుకొనేవాడు దొరకాలి. నా ఎమోషన్స్‌ ను గౌరవించాలి. ఇలా అన్ని రకాలుగా నచ్చితే అప్పుడు చూద్దాం. ప్రస్తుతానికైతే పెళ్లి ఆలోచన లేదు.

ఈ మధ్య నేను పాల్గొన్న కొన్ని ఇంటర్వ్యూల్లో కొందరు యాంకర్లు పెళ్లి గురించి అడుగుతున్నారు. నాతో చాలామంది యువత పెళ్లి అవసరమా అన్నారు! కొందరు మహిళలు కూడా చెప్పారు. మహిళ కుటుంబంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇంటి పని చేస్తుంది. జాబ్‌ చేస్తుంది. అలాంటి ఆలోచనలు ఉన్న వారి విధానం వేరుగా ఉంటుంది. పార్టనర్‌ సరైనవాడు దొరికితేనే మహిళ సేఫ్‌గా ఉంటుంది. లేదంటే పెళ్లి మీద అసహనం ఏర్పడుతుంది” అంటూ సంయుక్త మీనన్ చెప్పుకొచ్చింది.

ఇక భీమ్లా నాయక్ తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత ‘బింబిసార’ మూవీలో కూడా నటించింది. ఈ వారం అంటే ఫిబ్రవరి 17న ‘సార్’ మూవీతో మరోసారి ప్రేక్షకులను పలకరించనుంది.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus