నటుడు దర్శన్ పై చీటింగ్ కేసు పెట్టిన హీరోయిన్ సనంశెట్టి..!

  • October 6, 2020 / 03:27 PM IST

తెలుగు,తమిళ, మలయాళం భాషల్లోని పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన సనంశెట్టి అందరికీ గుర్తుండే ఉంటుంది. మహేష్ బాబు హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన ఆల్ టైం హిట్ మూవీ.. ‘శ్రీమంతుడు’ లో కూడా ఈమె నటించింది. ఆ చిత్రం ఫస్ట్ హాఫ్ లో ఈమెతో మహేష్ బాబుకి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు జగపతి బాబు. కానీ ఈమెను రిజెక్ట్ చేస్తాడు మహేష్. అందరికీ గుర్తొచ్చే ఉంటుంది.

అటు తరువాత సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన ‘సింగం 123’ చిత్రంలో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె ఓ నటుడి పై చీటింగ్ కేసు పెట్టడం చర్చనీయాంశం అయ్యింది. వివరాల్లోకి వెళితే.. తమిళ్ ‘బిగ్ బాస్’ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన నటుడు దర్శన్ తో సనంశెట్టి ఏడాది కాలంగా ప్రేమలో ఉందట. అయితే ఈమె పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. అతను నిరాకరించాడట.

అంతేకాదు అప్పటి నుండీ సనంకు దూరంగా ఉంటున్నాడట దర్శన్. దీంతో ఈమె అతని పై కేసు పెట్టింది. అయినప్పటికీ పోలీసులు దర్శన్ పై యాక్షన్ తీసుకోకుండా వదిలేశారని తెలుస్తుంది. అయినప్పటికీ సనం అస్సలు తగ్గకుండా కోర్టుకెక్కినట్టు తెలుస్తుంది.ఈ క్రమంలో దర్శిన్ పై చర్యల తీసుకోవాలంటూ కోర్టు వారు ఆదేశాలు జారీ చెయ్యడంతో.. పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారట. త్వరలోనే దర్శిన్ ను అరెస్టు చెయ్యబోతున్నారని సమాచారం.

Most Recommended Video

కాబోయే భర్తతో కాజల్… వైరల్ అవుతున్న రేర్ ఫోటోస్!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
‘బిగ్‌బాస్‌’ స్వాతి దీక్షిత్ గురించి మనకు తెలియని నిజాలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus