Sangeetha: నటి సంగీత 44వ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో స్టార్స్.. వైరల్ అవుతున్న ఫొటోలు..

కృష్ణవంశీ ‘ఖడ్గం’ మూవీలో ‘ఒకే ఒక్క ఛాన్స్’ డైలాగ్‌తో పాపులర్ అయ్యింది నటి సంగీత.. బాలకృష్ణ, శ్రీకాంత్, శ్రీహరి లాంటి స్టార్స్ అందరితోనూ యాక్ట్ చేసింది. తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లోనూ సినిమాలు చేసింది. టాలీవుడ్‌లో హోమ్లీ క్యారెక్టర్లతో గుర్తింపు తెచ్చుకుంది.2009లో కోలీవుడ్ సింగర్ కమ్ యాక్టర్ క్రిష్‌ని మ్యారేజ్ చేసుకుంది. వీరివి శివియా అనే పాప ఉంది. పెళ్లి తర్వాత ప్రొఫెషన్‌కి గ్యాప్ ఇచ్చిన సంగీత సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ మూవీలో స్పెషల్ సాంగ్ చేసి ఆకట్టుకుంది. తెలుగు, తమిళ్‌లో పలు టీవీ షోలకు జడ్జిగానూ చేసిందామె. సంగీత ఇటీవలే తన 44వ పుట్టినరోజుని ఫ్యామిలీతో పాటు ఇండస్ట్రీలో తను క్లోజ్‌గా ఉండే కొందరు సెలబ్రిటీలతో కలసి జరుపుకుంది.. సీనియర్ నటి రాధిక, సంఘవి, స్నేహా, ప్రీతి,‘కిక్‘ శ్యామ్, మీనా, మహేశ్వరి, డైరెక్టర్ వంశీ పైడిపల్లి తదితరులు ఈ పార్టీకి అటెండ్ అయ్యి.. సంగీతకు బర్త్‌డే విషెస్ తెలియజేశారు. సంగీత 44వ బర్త్‌డే సెలబ్రేషన్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus