Sangeetha: కోలీవుడ్ మేకర్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సంగీత.. ఏం చెప్పారంటే?

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలతో పాటు ఇతర ఇండస్ట్రీలలో కూడా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటీమణులలో సంగీత (Sangeetha) ఒకరు. ఒకప్పుడు హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించిన సంగీత ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సత్తా చాటుతూ ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే కోలీవుడ్ ఇండస్ట్రీ గురించి సంగీత సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. కోలీవుడ్ ఇండస్ట్రీలో సరైన మర్యాద ఉండదంటూ సంగీత కోలీవుడ్ మేకర్స్ పై షాకింగ్ కామెంట్స్ చేయడం జరిగింది.

Sangeetha

ఖడ్గం (Khadgam), పెళ్లాం ఊరెళితే సినిమాలతో పాపులర్ అయిన ఈ నటి తమిళ సినిమాలతో పోలిస్తే తెలుగు సినిమాలలో నటించడమే నాకు ఇష్టమని అన్నారు. తమిళంతో పోల్చి చూస్తే తెలుగులోనే ఎక్కువ గౌరవం లభిస్తుందని ఆమె పేర్కొన్నారు. తమిళ అభిమానులు ఆగ్రహించినా తాను చెప్పేది మాత్రం నిజమేనని సంగీత చెప్పుకొచ్చారు. తమిళంలో తానెవరినీ మూవీ ఆఫర్లు అడగలేదని ఆమె పేర్కొన్నారు. తెలుగులో తనకు మంచి ఆదరణ లభిస్తోందని సంగీత అన్నారు.

ఇక్కడ మంచి రెమ్యునరేషన్ తో పాటు ఆఫర్లు వస్తున్నాయని ఆమె చెప్పుకొచ్చారు. తమిళంలో కొందరు మూవీ ఆఫర్లు ఇస్తామని ఫోన్ చేసినా వాళ్లు మర్యాద లేకుండా మాట్లాడతారని సంగీత కామెంట్లు చేయడం జరిగింది. వాళ్లే తనకు జీవితాన్ని ఇస్తున్నట్టు తమిళం నుంచి ఫోన్ చేసిన వాళ్లు మాట్లాడతారని ఆమె పేర్కొన్నారు.

నా రెమ్యునరేషన్ ఎంతో కూడా వాళ్లే చెప్పేసి వచ్చి నటించి వెళ్లాలని సూచిస్తారని సంగీత చెప్పుకొచ్చారు. ఈ కారణాల వల్లే తాను తమిళ సినిమాలలో ఎక్కువగా నటించడం లేదని ఆమె అన్నారు. సంగీత చేసిన కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. సంగీత చేసిన కామెంట్లకు కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఏమైనా కౌంటర్ వస్తుందేమో చూడాల్సి ఉంది.

హిట్‌ ఇచ్చిన దర్శకుడి కోసం.. విజయ్‌ డిజాస్టర్‌ థీమ్‌ను కొనసాగిస్తాడా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus