Vijay Devarakonda: హిట్‌ ఇచ్చిన దర్శకుడి కోసం.. విజయ్‌ డిజాస్టర్‌ థీమ్‌ను కొనసాగిస్తాడా?

సినిమా హీరోలకు, వాళ్ల అభిమానులకు చిన్నపాటి సెంటిమెంట్లు ఉంటాయి. తమ హీరో ఇలా కనిపిస్తే సినిమా హిట్‌, అలా కనిపిస్తే సినిమా బ్లాక్‌బస్టర్‌ అని అనుకుంటూ ఉంటారు. ఇక హీరోలకు కూడా ఇలాంటివే కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్‌ ఆలోచనలతో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) అభిమానులు ఆందోళన చెందుతున్నారు. విజయ్‌ కొత్త సినిమాలో డ్యూయల్‌ రోల్‌లో నటిస్తున్నాడు అనేదే ఆ ఆందోళనకు కారణం. విజయ్‌ దేవరకొండ త్వరలో రాహుల్‌ సాంకృత్యాన్‌ (Rahul Sankrityan) దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.

Vijay Devarakonda

మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రారంభమవుతుంది అని టాక్. రాయలసీమ నేపథ్యంలో 1854 – 1878 మధ్య జరిగే కథతో ఈ సినిమా తెరకెక్కనుంది అని ఇప్పటికే వార్తలొచ్చాయి. ఈ సినిమాలో విజయ్‌ ఓ యోధుడి పాత్రలో కనిపిస్తాడట. అయితే ఇప్పుడాయన పాత్రకు సంబంధించి మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. రాహుల్‌ సినిమాలో విజయ్‌ (Vijay Devarakonda) .. తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తాడు అని అంటున్నారు. కొత్త మేకోవర్‌తో తండ్రి పాత్రలో కనిపిస్తాడని చెబుతున్నారు.

ఇక ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ పనులు జోరుగా సాగుతున్నాయి. త్వరలో ఈ విషయంలో క్లారిటీ వస్తుంది అని అంటున్నారు. నవంబరులో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తారని అంటున్నారు. ఈ సినిమాలో రష్మిక (Rashmika Mandanna) కథానాయికగా కనిపించే అవకాశం ఉంది అంటున్నారు. ఇక ఆందోళన సంగతి చూస్తే.. విజయ్‌ తన కెరీర్‌లో ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే డ్యూయల్‌ రోల్‌లో కనిపించాడు. తొలిసారి ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ (World Famous Lover) సినిమాలో గౌతమ్‌, శీనయ్యగా ద్విపాత్రాభినయం చేశాడు.

ఆ తర్వాత ‘లైగర్‌’ (Liger)  సినిమాలో బలరామ్‌ అగర్వాల్‌, శాశ్వత్‌ అగర్వాల్‌ అంటూ రెండు పాత్రల్లో కనిపించాడు. ఆ రెండు సినిమాల ఫలితం గురించి మీకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో అని అభిమానులు ఆలోచనలు చేస్తున్నారు. చూద్దాం విజయ ఏమన్నా తన ‘డ్యూయల్‌’ డిజాస్టర్‌ స్ట్రీక్‌కు ఈ సినిమాతో అడ్డుకట్ట వేస్తాడేమో.

వేణు స్వామి దంపతుల ఆరోపణలపై స్పందించిన జర్నలిస్ట్ మూర్తి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus