ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన సంగీత తెలుగులో నటించిన సినిమాలు తక్కువే అయినా ఆమెకు నటిగా మంచి గుర్తింపు వచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న సంగీతకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి. మసూద సినిమా ప్రమోషన్లలో భాగంగా అలీతో సరదాగా షోకు హాజరైన సంగీత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నేను బాల్యంలో లావుగా ఉండేదానినని బుగ్గలు కూడా పెద్దగా ఉండేవని ఆమె చెప్పుకొచ్చారు.
అదే సమయంలో నాకు చర్మ సంబంధిత సమస్యలు చాలా ఎక్కువని ఆమె చెప్పుకొచ్చారు. ఆ కారణం వల్ల నేనెప్పుడూ అందంగా ఉండనని అనుకునేదానినని ఆమె వెల్లడించారు. హీరోయిన్ కు ఉండాల్సిన లక్షణాలు నాలో లేవని అనిపించిందని ఆమె అన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎవరితో నాకు పరిచయం లేదని ఆమె తెలిపారు. నాకు పెద్ద నెట్వర్క్ కూడా లేదని సంగీత కామెంట్లు చేశారు. తమిళంలో చినప్పుడు ఒక సినిమాలో నేను నటించానని
ఆ సమయంలో మొహం అస్సలు బాలేదని అనిపించిందని సంగీత చెప్పుకొచ్చారు. నాకు నగలు వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదని ఈ లక్షణాలు లేవు కాబట్టి నేను హీరోయిన్ మెటీరియల్ కాదని అనుకున్నానని ఆమె కామెంట్లు చేశారు. కథ చదవకుండానే మసూద సినిమాకు ఓకే చెప్పానని ఆమె చెప్పుకొచ్చారు. మసూదా సినిమా దర్శకుడు వర్త్ ఉన్న దర్శకుడు అని నాకు తెలుసని ఆమె కామెంట్లు చేశారు.
దర్శకుడు స్క్రిప్ట్ పంపిన సమయంలో నేను కొన్ని అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నానని సంగీత అన్నారు. ఆ సమయంలో స్క్రిప్ట్ చదివే ఓపిక లేకపోవడంతో సినిమాకు ఓకే చేసేశానని సంగీత వెల్లడించారు. సంగీత నటిగా మరిన్ని మూవీ ఆఫర్లతో బిజీ కావాలని సంగీత అభిమానులు కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు సంగీతకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!