ఆకాశమే హద్దుగా సాగిపోవాలన్నదే నా ఆశయం!!!: ఔత్సాహిక యువ కథానాయిక సంజనా ఆకాశం –
- November 16, 2020 / 04:37 PM ISTByFilmy Focus
కిక్ బాక్సింగ్, హార్స్ రైడింగ్, డాన్సింగ్ లో శిక్షణ పొందడంతో పాటు… ‘ధియేటర్ ఆర్ట్స్’ చేసి, పలు ప్రదర్శనలిస్తూ ప్రశంసలు పొందుతున్న ‘సంజన ఆకాశం” సినిమాల్లోనూ సరైన అవకాశం కోసం ఎదురు చూస్తోంది. అన్నట్లు.. ‘వెస్ట్రన్ పాప్ సింగింగ్’ లోనూ సంజనకు మంచి ప్రావీణ్యముది. లండన్ లోని ట్రిని టీ మ్యూజిక్ కాలేజీ నుంచి డిప్లొమా తీసుకుంది.
తాప్సి పొన్ను తన రోల్ మోడల్ అంటున్న సంజన.. ప్రస్తుతం ‘లా’ చదువుతోంది. లాయర్ గానూ, యాక్టర్ గానూ తన కెరీర్ బ్యాలన్స్ చేసుకోవలన్నదే తన లక్ష్యమంటోంది. అవకాశాలకు హద్దులంటూ లేని ఈ రెండు రంగాల్లో అంకితభావంతో, అద్భుతంగా రాణించగలననే నమ్మకం తనకు ఉందంటోంది సంజన. “న్యూ ఏజ్ హీరోయిన్” కోసం చూస్తున్నవారు.. ముంబయికి పరుగులు తీసే ముందు.. ‘సంజన ఆకాశం’కి తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం నిక్షేపంగా ఇవ్వవచ్చు!!
Most Recommended Video
‘కమిట్ మెంటల్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?














