వెంకటేష్ సినిమాని వదులుకున్న బ్యూటీ!

విక్టరీ వెంకటేష్ సీనియర్ హీరో అయినప్పటికీ టాలీవుడ్, బాలీవుడ్ నటీమణులు.. అతనితో కలిసి స్టెప్పులు వేయడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. గురు సినిమా తర్వాత వెంకీ తేజ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ కోసం తేజ టీమ్ కొంతమందిని సంప్రదించారు. బాలీవుడ్ బ్యూటీ   అదితీరావు హైదరీ సంతోషంగా ఒకే చెప్పింది. అదితీరావు మలయాళ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత మణిరత్నం “చెలియా” చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంది.  తాజాగా “పద్మావత్” లో చిన్న రోల్ చేసి మెప్పించింది. ఆమె తమ సినిమాకి ప్లస్ అవుతుందని తేజ్ టీమ్ ఆనందిస్తుండగా హైదరీ షాక్ ఇచ్చింది.

స్వారీ నేను నటించలేనని చెప్పింది. మణిరత్నం దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రానికి ఎక్కువగా డేట్స్ ఇవ్వడం వల్ల.. వెంకీ చిత్రానికి డేట్స్ అడ్జస్ట్ చేయలేక పోతోందని సమాచారం. ఇక వెంకటేశ్ జోడీ కోసం తేజ మరో హీరోయిన్ వెతికే పనిలో పడ్డారు. సురేశ్ ప్రొడక్షన్స్, ఎ.కె. ఎంటర్‎టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి  “వేట నాదే ఆట నాదే” అనే పేరు పరిశీలిస్తున్నారు. వెంకటేష్ ప్రొఫెసర్ గా కనిపించనున్న ఇందులో నారా రోహిత్ కీలక పాత్ర పోషించనున్నారు. నేనే రాజు నేనే మంత్రి సినిమా తర్వాత తేజ చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus