Shantipriya: నటి భానుప్రియ చెల్లెలు నిశాంతి ఇప్పుడెలా ఉందో చూశారా.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

‘సీనియర్ నటి భానుప్రియ గురించి తెలుగు ఆడియన్స్‌కి కొత్తగా పరిచయం అక్కర్లేదు. స్టార్ హీరోలందరితోనూ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో తల్లి, వదిన లాంటి క్యారెక్టర్లతో అలరించింది. ఆమె చెల్లెలు శాంతిప్రియ కూడా నటిగా రాణించారు.. శాంతిప్రియ అసలు పేరు శాంతమ్మ.. నిశాంతి పేరుతో పాపులర్ అయ్యిందామె.. తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో యాక్ట్ చేసింది. ‘మహర్షి’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిశాంతి..

80, 90ల్లో తెలుగులో పలు సినిమాల్లో నటించింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే మ్యారేజ్ చేసుకుంది. ఆమె భర్త సిద్దార్థ్ రే (సుశాంత్ రే) హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించారు. వీరికి శుభమ్ రే, షిష్యా రే అనే ఇద్దరు కొడుకులున్నారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత 53 సంవత్సరాల వయసులో సెకెండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేసిందామె. ఈమధ్య సునీల్‌ శెట్టి, వివేక్‌ ఓబెరాయ్‌ నటించిన ‘ధారావి బ్యాంక్‌’ అనే వెబ్‌ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చింది.

ప్రస్తుతం ఈ వెబ్‌సిరీస్‌ ఎంఎక్స్‌ ప్లేయర్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇప్పుడు మరికొన్ని సినిమాలు, సిరీస్‌లకు ఆమె ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. 50 ప్లస్ లోనూ ఇప్పటికీ చక్కటి ఫిజిక్ మెయింటెన్ చేస్తుందామె. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గానే ఉంటుంది.. ట్రెడిషన్, ట్రెండీ ఫ్యాషన్‌లో కనిపిస్తూ లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తుంటుంది. రీ ఎంట్రీ వార్తలతో నెట్టింట నిశాంతి ఫోటోలు వైరల్ అవుతున్నాయి..

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus