కన్నడ హీరోయిన్ షర్మిల మాండ్రే రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆమె తన స్నేహితుడు లోకేష్ వసంత్ తో కలిసి కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. శనివారం ఉదయం 3 గంటల సమయంలో ఆమె తన స్నేహితుడు లోకేష్ వసంత్ తో కారులో వెళుతుండగా ఈ ఘటన జరిగింది. వీరు ప్రయాణిస్తున్న జాగ్వార్ కారు బెంగుళూరు లోని వసంత్ నగర్ కాలనీ లో పక్కనే ఉన్న స్థంబాన్ని ఢీ కొట్టింది.
దీనితో కారులో ఉన్న షర్మిలకు మరియు ఆమె స్నేహితుడు లోకేష్ వసంత్ కు తీవ్రగాయాలైనట్టు వార్తలు వస్తున్నాయి. దీనిని గమనించిన స్థానికులు పోలీస్ లకు మరియు వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చారట. వీరు ప్రస్తుతం ఓ స్థానికి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. కారు వేగంగా వచ్చి స్థంబాన్ని ఢీ కొట్టడంతో ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. కార్ లో ఎయిర్ బాగ్స్ తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
లాక్ డౌన్ సమయంలో వీరు ఎక్కడినుండి వస్తున్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ప్రమాద సమయంలో మద్యం మత్తులో ఉన్నట్లు ఆధారాలు లభ్యం అయ్యాయి. కన్నడ సినిమాలలో ఎక్కువగా నటించే షర్మిల 2013లో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన కెవ్వు కేక చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆ విధంగా షర్మిల తెలుగు ప్రేక్షకుల పరిచయమే. ప్రస్థుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది.
Most Recommended Video
ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్