సుకుమార్.. ఆ హీరోయిన్ ను పక్కన పెట్టబోతున్నాడా?

ప్రస్తుతం ఓ సినిమాలో నటించే హీరోయిన్ కంటే కూడా.. ఐటెం సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ చేసే వాళ్ళకే ఎక్కువ పారితోషికం దక్కుతుంది. రెండున్నర గంటల సినిమాలో వచ్చే 5 నిమిషాల పాటకు అంత పెట్టాలా అని నిర్మాతలు ఇప్పటి వరకూ ఆలోచించలేదు. ముఖ్యంగా పెద్ద హీరోలతో సినిమాలు చేసే నిర్మాతలు.. ఐటెం సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ చేసే హీరోయిన్లు ఎంత రేటు చెప్పినా అస్సలు నో చెప్పరు. అయితే ఇప్పుడు లాక్ డౌన్ వల్ల రెండు నెలలు పై నుండే షూటింగ్ లు ఆగిపోయాయి.

రిలీజ్ కావాల్సిన సినిమాలు కూడా ఆగిపోవడంతో నిర్మాతలకు చాలా నష్టం వాటిల్లింది. దీంతో నటీనటుల పారితోషికాల్లో కోతలు విధించాలి అని డిసైడ్ అయ్యారు. ఇదిలా ఉంటే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు సుకుమార్ డైరెక్షన్లో ‘పుష్ప’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా సుకుమార్ సినిమాల్లో అదిరిపోయే ఐటెం సాంగ్ ఉంటుంది. ఒక్క ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో తప్ప.. తాను డైరెక్ట్ చేసిన అన్ని సినిమాల్లోనూ ఐటెం సాంగ్స్ ఉంటాయి. ఇప్పుడు బన్నీతో చేస్తున్న ‘పుష్ప’ లో కూడా ఐటెం సాంగ్ ప్లాన్ చేసాడట.

ఇందుకోసం బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌటెలా తో ఐటమ్ సాంగ్ చేయించాలని అనుకున్నాడు. అయితే ఆ సాంగ్ కోసం ఆమె కోటి రూపాయలు డిమాండ్ చేస్తుందట. ఓ పక్క నటీనటుల పారితోషికాల్లో కోతలు విధంచాలని దర్శక నిర్మాతలు అనుకుంటుంటే.. ఊర్వశి మాత్రం కోటి రూపాయలు అది కూడా ఒక్క పాటకు డిమాండ్ చెయ్యడంతో దర్శక నిర్మాతలు షాక్ కు గురయ్యారట. దీంతో ఆమెని పక్కన పెట్టి వేరే హీరోయిన్ తో ఈ సాంగ్ చెయ్యించాలని ప్లాన్ చేస్తున్నారట.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus