కొత్త సినిమా విషయాలు చెప్పిన శ్రియ

ఇష్టంతో తెలుగు చిత్ర సీమలోకి అడుగుపెట్టిన శ్రియ.. అందరికి ఇష్టమైన నటిగా మారిపోయింది.  టాలీవుడ్ సీనియర్ హీరోలతో పాటు, యువ హీరోల పక్కన స్టెప్పులు వేసింది. తనతో పాటు వచ్చిన హీరోయిన్స్ అందరూ పక్కకు తప్పుకున్నప్పటికీ శ్రియ మాత్రం దాదాపు పదిహేనేళ్లుగా నటిగా కొనసాగుతోంది. పెళ్లి చేసుకున్నప్పటికీ నటనని వదులుకోలేదు. తాజాగా “వీరభోగ వసంత రాయులు” అనే సినిమాలో కీలకరోల్  పోషించింది. నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీవిష్ణులు హీరోలుగా నటించిన ఈ మూవీ వచ్చే వారం థియేటర్లోకి రానుంది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా మీడియా ముందుకు వచ్చిన శ్రియ అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించింది. “నా కెరీర్ లో ఇప్పటి వరకు చేయని విభిన్నమైన పాత్రను ఇందులో చేశాను. నా పాత్ర సీరియస్ గా, స్ట్రాంగ్ గా ఉంటుంది.

ఈ చిత్రంలో నటించడం వల్ల ఒక మంచి సినిమా చేశాననే తృప్తి నాకు కలిగింది” అని శ్రియ వివరించింది. ఇంకా ఆ పాత్ర కోసం పడిన కష్టాన్ని గుర్తు చేసుకుంటూ..”ఈ చిత్రంలోని పాత్ర కోసం సిగరెట్, మందు తాగాల్సి వచ్చింది. సిగరెట్ తాగడం నాకు చాలా ఇబ్బంది అయింది. సిగరెట్ సీన్స్ ముందే చాలా ప్రాక్టీస్ చేసాను. అయితే గదిలో సిగరెట్ సీన్ ఉండటం వల్ల రూమ్ మొత్తం సిగర్ స్మోక్ నిండి పోయి అందరం ఇబ్బంది పడ్డాము. గదిలో సిగరెట్ స్మోక్ చేస్తూ సీన్ లో నటించడం అంటే మామూలు విషయం కాదు, కాని తప్పని పరిస్థితుల్లో పాత్ర చాలా స్ట్రాంగ్ గా రావాలనే ఉద్దేశ్యంతో అలా నటించాల్సి వచ్చింది. ఆ కష్టం అంతా కూడా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తే పోతుంది” అని శ్రియ నవ్వుతూ చెప్పింది. ఈ సినిమాలో శ్రియ ఎంతమేర మెప్పిస్తుందో కొన్ని రోజుల్లో తెలియనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus