సినీనటి సౌమ్య శెట్టి ఇటీవల తన స్నేహితురాలి ఇంట్లో బంగారాన్ని చోరీ చేసినందుకు గాను అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. విశాఖపట్నం, దొండపర్తి ప్రాంతంలో ఉన్న బాలాజీ రెసిడెన్సీ లో జనపాల ప్రసాద్ కుమార్తె మౌనిక.. సౌమ్య స్నేహితులు. యూట్యూబ్ లో షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ వీరు స్నేహితులయ్యారు. మౌనికకు మోడలింగ్‌పై ఆసక్తి ఉంది. అందుకే సౌమ్యకి దగ్గరయ్యింది. కానీ తర్వాత మౌనికకు ఆమె తల్లిదండ్రులు వివాహం చేశారు.
దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. సౌమ్య కూడా ఒడిశా, సుజాతానగర్ కు చెందిన బలరాం శెట్టిని ప్రేమ వివాహం చేసుకుంది. కొన్నాళ్ల తర్వాత సౌమ్య, మౌనిక ఇన్స్టాగ్రామ్ ద్వారా టచ్ లోకి వచ్చారు. మౌనికకు పాప పుట్టడం.. దీంతో దొండపర్తిలోని ఆమె పుట్టింట్లో ఉంటున్న విషయాన్ని సౌమ్యకి చెప్పడంతో ఆమె మళ్ళీ ఆమె ఇంటికి వెళ్లడం మొదలు పెట్టింది. పైగా ‘ద ట్రిప్’ ‘యు వర్స్ లవింగ్లీ’ వంటి సినిమాల్లో సౌమ్య నటించిన విషయాన్ని తెలుసుకున్న మౌనిక మరింతగా ఆమెకు ఆకర్షిస్తురాలు అయ్యింది.
అందువల్ల సౌమ్యని ఆమె తన ఇంటికి రమ్మని ఎక్కువగా ఆహ్వానించేది. అయితే ఇదే క్రమంలో ఆమె మౌనిక ఇంట్లో నగలు చోరీ చేసేదని ఆలస్యంగా అందరికీ తెలిసొచ్చింది. ఫిబ్రవరి 23న ఎలమంచిలిలోని బంధువుల ఇంట శుభ కార్యక్రమం ఉండడంతో మౌనికతో పాటు ఆమె తల్లిదండ్రులు బంగారు ఆభరణాల కోసం బెడ్‌రూమ్‌లోని కప్‌బోర్డు తెరవగా అక్కడ బంగారం మిస్ అయినట్లు తేలింది. దీంతో వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదుచేసి .. తరచూ ఇంటికి వచ్చి వెళ్లిన వారి లిస్ట్ ను చెక్ చేశారు.
అందులో సౌమ్య శెట్టి ఎక్కువగా ఉండటంతో ఆమెను పోలీసులు అనుమానించారు. వాష్‌రూమ్‌కి వెళతానంటూ మాస్టర్ బెడ్‌రూమ్‌లోకి వెళ్లి డోర్ వేసుకునేదని మౌనిక ఇంట్లో వాళ్ళు చెప్పారు.దీంతో సౌమ్య బ్యాంక్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్స్ చెక్ చేయగా అసలు విషయం బయటపడింది. ఈ క్రమంలో సౌమ్య కొత్త నగలు కొనుగోలు చేయడం, గోవాకి వెళ్లి ఎంజాయ్ చేయడం వంటివి పోలీసులు గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకుని ఇంటరాగేట్ చేశారు.
మొదట బుకాయించిన సౌమ్య (Sowmya Shetty) తర్వాత అసలు విషయాన్ని బయట పెట్టింది. బంగారం విక్రయించగా వచ్చిన డబ్బులో రూ.4 లక్షలతో గోవా ట్రిప్ వేసినట్టు, రూ.2 లక్షలు క్రెడిట్‌కార్డు బిల్లులు కట్టినట్టు, రూ. 1.5 లక్షలుతో కార్ రిపేర్ కోసం వాడినట్టు ఆమె బయటపడింది.
‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!
నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!