మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధమాకా’ మూవీ ఈ శుక్రవారం అంటే డిసెంబర్ 23న రిలీజ్ కాబోతుంది. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ & ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ బ్యానర్లపై ఈ చిత్రాన్ని టి జి విశ్వప్రసాద్ ,వివేక్ కూచిభొట్ల నిర్మించారు. ‘ధమాకా’ పాటలకు, టీజర్, ట్రైలర్ లకు సూపర్ రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ధమాకా ప్రమోషన్లో భాగంగా ఆమె కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. అవి మీ కోసం :
ప్ర. ‘ధమాకా’ ఆఫర్ మిమ్మల్ని ఎలా వరించింది? ‘పెళ్ళి సందD’ సక్సెస్ వల్లే ఈ ఆఫర్ మీకు వచ్చింది అనుకోవచ్చా?
శ్రీలీల : డైరెక్టర్ త్రినాథరావు నక్కిన గారు ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రంలో ఓ రోల్ కోసం నన్ను సంప్రదించారు. అదే టైంలో రైటర్ ప్రసన్న గారు కూడా పరిచయమయ్యారు. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయాను. ‘పెళ్ళి సందD’ రిలీజ్ కాకుండానే ‘ధమాకా’ కథ వినడం ఓకే చెప్పేయడం జరిగిపోయింది. కథ విన్న పది నిమిషాలకే నేను ఓకే చెప్పేశాను.
ప్ర.’ధమాకా’ కథలో మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటి?
ఇది మంచి ఎంటర్టైనర్. చాలా హిలేరియస్ గా ఉంటుంది. నాకు ఎంటర్టైన్మెంట్ సినిమాలు అంటే చాలా ఇష్టం. అందుకే ఓకే చెప్పేశాను.
ప్ర.సోషల్ మీడియాలో రవితేజ గారి ఏజ్ గురించి మీ గురించి కొంత ట్రోలింగ్ జరుగుతుంది. దానిని మీరు ఎలా తీసుకుంటారు?
సినిమాలో పాత్రకు ఎంత ఏజ్ అనేది తెలిస్తే వాళ్ళు ఎందుకు ట్రోల్ చేస్తారు?(నవ్వుతూ). జోక్స్ అనేవి పక్కన పెడితే.. నాకంటే గొప్ప గొప్ప హీరోయిన్లు స్టార్ హీరోలతో నటించేప్పుడు. ఏజ్ గురించి పట్టించుకోలేదు. నేను ఎంత చెప్పండి. పైగా రవితేజ గారి ఎనర్జీ చూస్తే నాకంటే చిన్న వయసున్న వ్యక్తి అనిపిస్తుంది. అలాంటి ట్రోలింగ్ ను నేను పట్టించుకోను.
ప్ర. ఇంత తక్కువ టైంలో రవితేజ లాంటి స్టార్ తో పనిచేసే అవకాశం దక్కింది?దానికి ఎలా ఫీలవుతున్నారు ?
రాఘవేంద్ర రావు గారు వంటి పెద్ద దర్శకుల సపోర్ట్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం ఆ వెంటనే రవితేజ వంటి పెద్ద స్టార్ సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.ఈ విషయంలో రోజూ దేవుడికి థాంక్స్ చెప్పుకుంటాను. రవితేజ గారు కొత్త హీరోలను బాగా మోటివేట్ చేస్తారు. ఆయనతో పని చేయడంలో ఒక కంఫర్ట్ ఉంటుంది. రవితేజ గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. కిక్, విక్రమార్కుడు సినిమాలు ఎన్ని సార్లు చూశానో నాకే తెలీదు. ఆయన్ని మొదటిసారి సెట్ లో చూసినప్పుడు ఒక సర్ ప్రైజ్ ఫీలింగ్. పాత్రలో వేరియేషన్స్ ని చాలా ఈజీగా చూపించగలరు. ఇంత ఈజీగా ఎలా చేయగలుగుతున్నారని ఆయన్ని అడుగుతుంటాను. ‘విక్రమార్కుడు’ డ్యుయల్ రోల్ ఎంత అవుట్ స్టాండింగా చేశారో.. ధమాకాలో అంతే అద్భుతంగా చేశారు.
ప్ర. రవితేజ గారి ఎనర్జీని మీరు మ్యాచ్ చేయగలిగారా?
అది సినిమా చూసి మీరే చెప్పాలండీ(నవ్వుతూ). డ్యాన్సులు చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. నాకు చిన్నప్పటి నుండి డ్యాన్స్ అంటే ఇష్టం. నేను సినిమాల్లోకి రాకముందే డ్యాన్స్ నేర్చుకున్నాను.
ప్ర.డైరెక్టర్ త్రినాథరావు నక్కిన గారి ముందు సినిమాలు చూశారా?
హ చూశాను. ‘నేను లోకల్’ పాటలు బెంగళూర్ లో ఉన్నప్పుడు తెగ వినేదాన్ని. అందులో కీర్తి సురేష్ గారి పాత్ర నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఆయన చాలా పాజిటివ్ పర్సన్.
ప్ర.’ధమాకా’లో మీ ఫేవరెట్ సాంగ్ ?
‘జింతాక్’ పాట బాగా నచ్చింది. తర్వాత ‘వాట్స్ హ్యాపెనింగ్’ అనే పాట కూడా ఇష్టం.ముఖ్యంగా అందులో వయోలిన్ బీట్ చాలా ఇష్టం.
ప్ర. ట్రైలర్ లో ఇద్దరూ ఇష్టమే అని చెప్పారు. ఇందులో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
ఇందులో ప్రణవి అనే పాత్రలో కనిపిస్తా. డబల్ రోల్ తో ట్రావెల్ అయినప్పుడు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇద్దరూ ఇష్టం అంటే.. ముగింపు ఎలా ఉంటుందనేది ఇందులో ట్విస్ట్ ఫ్యాక్టర్.
ప్ర. ఈ చిత్రం నిర్మాతల గురించి చెప్పండి ?
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు నన్ను చాలా ఆప్యాయంగా చూసుకున్నారు. మోరల్ సపోర్ట్ కూడా ఇచ్చారు. ‘మన అమ్మాయి’ అనే కేరింగ్ వాళ్ళు చూపిస్తారు. వారి నిర్మాణంలో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది.
ప్ర. నటన, చదువుని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ?
నేను బేసిగ్గా స్విచాన్ స్విచాఫ్ పర్సన్ ని.! యాక్టర్ అవుతున్నప్పుడు అందరి దృష్టి ఉంటుంది. మెడిసిన్ చదువు విషయానికి వస్తే .. అక్కడ మనల్ని మనలానే వదిలేస్తారు. ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేసుకోవడం ఇష్టం. షూటింగ్ నుండి వచ్చినా ఇంట్లో చదువుకుంటూ ఉంటాను.
ప్ర. మీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి?
బాలకృష్ణ గారు, అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తున్నాను. ఈ మధ్యనే షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అలాగే బోయపాటి-రామ్ గారి సినిమా కూడా చేస్తున్నాను. వైష్ణవ్ తేజ్ తో చేస్తున్న సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అలాగే వారాహి ప్రొడక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాను. నితిన్ గారితో ఒక సినిమా ఉంది.
ప్ర.మహేష్ బాబు – త్రివిక్రమ్ మూవీలో నటిస్తున్నారు అని విన్నాం?
మిగిలినవన్నీ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ప్రకటిస్తారు. ఇప్పటికైతే సస్పెన్స్.(నవ్వుతూ)