Sreeleela Remuneration: పెళ్లి సందడి బ్యూటీ ఎంత డిమాండ్ చేస్తోందంటే?

పెళ్లి సందడి బ్యూటీ శ్రీ లీల పేరు ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. పాతికేళ్ల వయసులోకి రాకముందే అగ్ర హీరోలతో ఛాన్స్ అందుకునే విధంగా అడుగులు వేస్తోంది. ఇటీవల కాలంలో సీనియర్ హీరోయిన్స్ హావా తగ్గడంతో కొత్త తరహా బ్యూటీలకు మంచి డిమాండ్ ఏర్పడింది. నటనలోనే కాకుండా గ్లామర్ తో కూడా మంత్ర ముగ్దులను చేస్తుండడంతో ఇటీవల సక్సెస్ కొట్టిన కొంతమంది హీరోయిన్స్ కు అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి.

ఇక అందులో శ్రీలీలా కూడా టాప్ లిస్టులో ఉందని చెప్పవచ్చు. శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన పెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన శ్రీ లీల నెమ్మదిగా తన క్రేజ్ ను పెంచుకుంటోంది. ఆ సినిమా కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకోవడంతో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇక ఇదే సమయంలో రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచినట్లగా తెలుస్తోంది. మొదటి సినిమాకి 30 నుంచి 50 లక్షల మధ్యలో పారితోషికం తీసుకున్న శ్రీ లీల ఇప్పుడు చేయబోయే సినిమాలకు మాత్రం కోటి వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ రేంజ్ అయితే చాలా వరకు తగ్గిపోయింది. ఇక పూజా హెగ్డే, రష్మిక మందన్న వంటి స్టార్ హీరోయిన్స్ పాన్ ఇండియా బాట పట్టారు. ఇక వారి అనంతరం కృతి శెట్టి వంటి వారు స్టార్ హీరోయిన్స్ గా వారి స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక శ్రీలీల కూడా ఇటీవల రవితేజ, వైష్ణవ్ తేజ్ వంటి వారితో ఛాన్స్ లు అందుకుంది. అలాగే నవీన్ పొలిశెట్టితో కూడా లో ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది.

మరి ఈ బ్యూటీ ఆ సినిమాలతో ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటుందో చూడాలి. శ్రీలీల ప్రస్తుతం మెడిసిన్ కోర్స్ పూర్తి చేస్తోంది. ఓ వైపు చదువు మరోవైపు యాక్టింగ్ తో అమ్మడు చాలా బిజీగా కనిపిస్తోంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus