Sreeleela: సోషల్ మీడియా అంతటా శ్రీలీల నామస్మరణ.. ఆమె రేంజ్ ఇదే!

టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీల పట్టిందల్లా బంగారం అవుతున్న సంగతి తెలిసిందే. రోషన్ హీరోగా తెరకెక్కిన పెళ్లిసందD, ధమాకా సినిమాలలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా ఈ రెండు ప్రాజెక్ట్ లు యావరేజ్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచి శ్రీలీల క్రేజ్ ను అమాంతం పెంచేశాయి. ప్రస్తుతం శ్రీలీల ఏకంగా 7 ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. స్టార్ హీరోలు, యంగ్ హీరోలు అనే తేడాలు లేకుండా అందరు హీరోలను శ్రీలీల కవర్ చేస్తున్నారు.

ఒకవైపు మెడిసిన్ చదువుతూనే మరోవైపు యాక్టర్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న శ్రీలీల నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న సినిమాల నుంచి పోస్టర్లు రిలీజ్ కాగా ఊహించని సర్ప్రైజ్ లు తమకు ఎంతగానో సంతోషాన్ని కలిగించాయని అభిమానులు చెబుతున్నారు. గుంటూరు కారం నుంచి పల్లెటూరి యువతి లుక్ లో రిలీజైన శ్రీలీల పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

చీరలో శ్రీలీల (Sreeleela) అందానికి ఎవరూ సాటిరారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమయ్యాయి. పోస్టర్లలో చూపులతోనే శ్రీలీల మాయ చేస్తోందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భగవంత్ కేసరి నుంచి రిలీజైన పోస్టర్ లో సింపుల్ లుక్ తో శ్రీలీల ఆకట్టుకున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి విడుదలైన పోస్టర్ లో ఒకింత కోపంగా చూస్తూ శ్రీలీల మెప్పించారు.

ఆదికేశవ మూవీ నుంచి రిలీజైన పోస్టర్ లో ప్లెయిన్ ఎల్లో కలర్ శారీలో కనిపించి ఈ బ్యూటీ ఆకట్టుకున్నారు. రామ్ బోయపాటి కాంబో మూవీ నుంచి విడుదలైన పోస్టర్ లో గ్లామరస్ లుక్ తో శ్రీలీల ప్రేక్షకులను ఫిదా అయ్యేలా చేశారు. నితిన్32 మూవీ నుంచి రిలీజైన పోస్టర్ లో శ్రీలీల స్టైలిష్ లుక్ లో మెప్పించారు. ఒక హీరోయిన్ పుట్టినరోజుకు ఈ స్థాయిలో సర్ప్రైజ్ లు రావడం శ్రీలీల విషయంలోనే జరిగింది. శ్రీలీల లీలలు మామూలుగా లేవని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అదిరిపోయే సర్ప్రైజ్ లతో శ్రీలీల అభిమానుల ఆకలి తీర్చేశారు.

అదిరిపోయే మూవీ అప్ డేట్స్ తో పాటు ఆహా ఓటీటీ కోసం బన్నీతో శ్రీలీల దిగిన ఫోటోకు సంబంధించిన పోస్టర్ కిర్రాక్ లుక్ తో నెక్స్ట్ లెవెల్ లో ఉంది. మరో మూడేళ్ల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏ మాత్రం గ్యాప్ లేకుండా శ్రీలీల ఏలబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. శ్రీలీల టాలెంట్, డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తమ హృదయాలను శ్రీలీల దోచేసిందని కుర్రకారు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus