Sreeleela, Samantha: ఆఖరికి సమంతకు ఇది కూడా కలిసిరాలేదు!

సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత త్వ‌ర‌లోనే హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుందంటూ గ‌త కొద్ది రోజుల నుంచి వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఇంగ్లీష్ మూవీకి స‌మంత క‌మిట్ అయింద‌ని.. చెన్నై స్టోరీ అనే టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌నుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందులో హాలీవుడ్ న‌టుడు వివేక్ క‌ల్రా హీరో కాగా.. ఫిలిప్ జాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇదొక రొమాంటిక్ ల‌వ్ స్టోరీ అట‌. ఇంగ్లాండ్ దేశానికి చెందిన అబ్బాయిగా వివేక్ క‌ల్రా, చెన్నైకి చెందిన అమ్మాయిగా స‌మంత క‌నిపిస్తుంద‌ని రెండు రోజుల నుంచి జోరుగా వార్త‌లు వ‌చ్చాయి.

కానీ, ఇప్పుడు ఊహించ‌ని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ సినిమాలో ( Samantha) సమంతను తీసేశారట. ఆ స్థానంలో శ్రీలీలను జాయిన్ చేసుకున్నారట. స‌మంత సైన్ చేయాల్సిన ఈ హాలీవుడ్ మూవీని యంగ్ బ్యూటీ శ్రీ‌లీల లాగేసుకుని బిగ్ షాక్ ఇచ్చిన‌ట్లు టాక్ న‌డుస్తోంది. స‌మంత‌ను కాద‌ని శ్రీ‌లీల‌ను హీరోయిన్ గా ఎంపిక చేశార‌ని అంటున్నారు. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రావాల్సిందే. పాపం సమంతకు ఈ అవకాశం కూడా కలిసిర రాలేదని నెటిజన్లు అంటున్నారు.

కాగా, టాలీవుడ్ లో శ్రీ‌లీల ప్ర‌స్తుతం యంగ్ సెన్షేష‌న్ గా మారింది. వ‌చ్చి రెండేళ్లు కాకముందే చేతి నిండా ప్రాజెక్ట్ ల‌తో ఫుల్ బిజీగా మారిపోయింది. ఇక శ్రీలీల తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం చేస్తున్న చిత్రాల సంఖ్యను ఒకసారి చూస్తే.. శ్రీలీల తెలుగు చిత్ర పరిశ్రమను ఎలా శాసిస్తుందో తెలుస్తుంది. మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమా (SSMB28), పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ ల ‘ఉస్తాద్ భగత్ సింగ్’, NBK108, ఇందులో ఆమె బాలకృష్ణ కుమార్తెగా నటిస్తోంది.

రామ్ పోతినేని – బోయపాటి సినిమా, వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న కొత్త చిత్రం, నవీన్ పోలిశెట్టితో అనగనగా ఒక రాజు, విజయ్ దేవరకొండ 12వ సినిమా. అయితే ఇందులో విజయ్ దేవరకొండ సినిమా మినహా, మిగిలిన సినిమాలన్నీ షూటింగ్స్ వివిధ దశల్లో ఉన్నాయి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus