సింగర్ శ్రీరామ్ తో పర్సనల్ చాట్ బయటపెట్టిన శ్రీరెడ్డి.!

కాస్టింగ్ కౌచ్ గురించి టీవీ ఛానల్లో బోల్డ్ గా మాట్లాడి సంచలనానికి దారితీసిన నటి శ్రీరెడ్డి ఈ రోజు మరో శృంగార పురుషుడి బాగోతాన్ని బయటపెట్టింది.  కొన్ని గంటల క్రితం తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా “చూడండి.. ఇండియన్ ఐడల్ చాట్ .. షేమ్ ఆన్ యు శ్రీరామ్” అంటూ ఆయనతో కలిసి చేసిన రొమాంటిక్ చాట్‌తో పాటు సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా శ్రీరెడ్డి షేర్ చేసింది. ఈ హాట్ చాట్ టాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారితీసింది. శ్రీరామ్ సింగర్ గా ఇండియన్ ఐడల్ ని సొంతంచేసుకొని తెలుగు యువతకి స్ఫూర్తిగా నిలిచారు. సినిమాల్లోనూ మంచి పాటలు పాడి ఆకట్టుకున్నారు. ఇప్పుడు అతను శ్రీ రెడ్డి తో చేసిన చాట్ చూసి నివ్వెరపోతున్నారు.

ఈ విషయంలో శ్రీరామ్ కి ఎక్కువమంది మద్దతు తెలపడం విశేషం. శ్రీరెడ్డి  రెచ్చగొట్టే విధంగా మాట్లాడితేనే శ్రీరామ్ హద్దులు మరిచారని సమర్ధించారు. శ్రీరెడ్డి అందాల గురించి వర్ణించడం వరకు వచ్చాడంటే.. వారిద్దరి మధ్య ఎంత అండర్ స్టాండింగ్ ఉందో అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై శ్రీరామ్ వివరణ కోసం  మీడియా ఎదురుచూస్తోంది. అలాగే శ్రీ రెడ్డి ఇంకెవరి బాగోతాన్ని బయటపెడుతుందోనని మీడియా ఫోకస్ మొత్తం ఆమెపై పెట్టింది. తనతో శృంగారంగా మాట్లాడిన వారి వాయిస్ ని కూడా శ్రీరెడ్డి రికార్డింగ్ చేసినట్లు సమాచారం. అవి కూడా త్వరలోనే బయటికిరానుందని టాక్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus