Sridevi: సీనియర్ హీరోయిన్ శ్రీదేవి ఆ కోరిక తీరకుండానే మృతి చెందారా?

  • August 14, 2024 / 05:51 PM IST

సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి (Sridevi) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆరోగ్య సమస్యల వల్ల శ్రీదేవి కొన్నేళ్ల క్రితం మృతి చెందినా ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం ఆమె జీవించే ఉన్నారు. నిన్న శ్రీదేవి పుట్టినరోజు కాగా ఆమెకు సంబంధించిన కీలక విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. బాలనటిగా కెరీర్ ను మొదలుపెట్టిన శ్రీదేవి తర్వాత రోజుల్లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.

Sridevi

ఒకవైపు గ్లామర్ రోల్స్ లో నటిస్తూనే మరోవైపు హీరోయిన్ రోల్స్ కు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ శ్రీదేవి ప్రేక్షకుల మెప్పు పొందారు. సీనియర్ ఎన్టీఆర్ (Sr NTR) , ఏఎన్నార్ (Akkineni Nageswara Rao) , కృష్ణ (Krishna) లకు హీరోయిన్ గా నటించి శ్రీదేవి ప్రశంసలు అందుకున్నారు. తర్వాత తరం హీరోలైన చిరంజీవి (Chiranjeevi), నాగార్జున (Nagarjuna), వెంకటేశ్ (Venkatesh Daggubati) లతో కలిసి ఆడిపాడి ఆమె మెప్పించారు. అయితే ఎక్కువ సంఖ్యలో గొప్ప రోల్స్ లో నటించిన శ్రీదేవి ఒక పాత్రలో మాత్రం నటించలేదు.

నేను ఎక్కువ సంఖ్యలో రోల్స్ లో నటించాను కానీ దేవదాస్ సినిమాలో పార్వతి, లైలా మజ్ను సినిమాలో లైలా రోల్స్ లో చేయాలని ఎంతో కోరిక అని శ్రీదేవి జీవించి ఉన్న సమయంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. షర్మిలీలోని రాఖీ చేసిన డ్యూయల్ రోల్ నన్ను ఎంతగానో ఆకట్టుకుందని ఆమె పేర్కొన్నారు. ఒక్కోసారి మంచి రోల్ చేజారిపోయిన సమయంలో నేను బాధ పడతానని శ్రీదేవి పేర్కొన్నారు. భారతీరాజా కిళెక్కే పోగుం రైలు తీసిన సమయంలో అందులో హీరోయిన్ రోల్ కు నన్ను అడిగారని శ్రీదేవి చెప్పుకొచ్చారు.

20 రోజులు అవుట్ డోర్ లో ఉండాలని చెప్పగా అప్పుడు నాకున్న కమిట్ మెంట్ల వల్ల నేను సారీ చెప్పానని శ్రీదేవి పేర్కొన్నారు. ఆ సమయంలో మంచి రోల్ తప్పిపోయిందని బాధగా అనిపించిందని ఆమె చెప్పుకొచ్చారు. ఆ రోల్ నాకు రాకపోవడం మంచిదే అయిందని శ్రీదేవి వెల్లడించారు. ఆ పాత్ర ద్వారా రాధిక (Radhika) లాంటి మంచి నటికి ప్రవేశం లభించి ఇండస్ట్రీకి గొప్ప నటి దొరికిందని అనిపించిందని శ్రీదేవి పేర్కొన్నారు. శ్రీదేవి గతంలో చెప్పిన విషయాలు ప్రస్తుతం మళ్లీ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus