సలార్ సినిమాలో రాధా రామ మన్నార్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు నటి శ్రియ రెడ్డి. ఈమె ఇదివరకు పలు తెలుగు తమిళ సినిమాలలో నటించారు. అయితే కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె తిరిగి సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో ఈమె తన నటన ద్వారా ప్రేక్షకులను మెప్పించారని చెప్పాలి. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో శ్రియా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె ప్రభాస్ అందరికీ ఫుడ్ పెట్టే విషయం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ అందరిని ఫుడ్ పెట్టి ప్రేమతో చంపేస్తారు అంటూ ఈమె కామెంట్లు చేశారు. అయితే ప్రభాస్ ఫుడ్ నుంచి తాను తప్పించుకున్నాను అంటూ సరదాగా కామెంట్లు చేశారు. నాకు మాత్రం దయచేసి ఫుడ్ పంపించకు అంటూ ప్రభాస్ కి వార్నింగ్ ఇచ్చానని శ్రియ రెడ్డి తెలిపారు.
సలార్ షూటింగ్ సమయంలో ప్రభాస్ తన వద్దకు వచ్చి మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టమని అడిగారట నేను ఏ ఫుడ్ తినను మీరు పంపించే ఫుడ్ అసలే తినను ఎందుకంటే నేను డైట్ లో ఉన్నాను కనుక తిననని నాకు మాత్రం ఫుడ్ పంపించకు అంటూ చెప్పారట కానీ ప్రభాస్ తనని పదేపదే అడగడంతో తనకు స్వీట్ అంటే ఇష్టం అని చెప్పాను అయితే నాకు ఇష్టమైన స్వీట్స్ మాత్రం పంపించకు అని చెప్పాను.
ఈ సినిమా షూటింగ్ అయ్యేవరకు నాకు ఎలాంటి ఫుడ్ పంపించకూడదు అంటూ ఈమె (Sriya Reddy) ప్రభాస్ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చాను అంటూ తెలియజేశారు. అలా వార్నింగ్ ఇవ్వడం వల్లే నేను ప్రభాస్ ఫుడ్ నుంచి తప్పించుకున్నాను అంటూ ఈ సందర్భంగా ఈమె తెలియజేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ప్రభాస్ ఒకసారి ఆతిథ్యం ఇచ్చారు అంటే మామూలుగా ఉండదు అంటూ ఇది వరకు ఎంతో మంది సెలబ్రిటీలు తెలిపిన సంగతి తెలిసిందే.
సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!
డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!