Actress Sudha: వైరల్ అవుతున్న ప్రముఖ నటి సుధ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • July 29, 2024 / 12:14 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒక వెలుగు వెలిగిన నటీమణులలో సుధ (Sudha) ఒకరు. ఇండస్ట్రీలో చాలామంది హీరోలకు తల్లి పాత్రలో నటించి సుధ మెప్పించారు. 20 సంవత్సరాల క్రితం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో మురారి (Murari)  ఒకటి కాగా ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఈ సినిమాలో మహేశ్ (Mahesh Babu)  కు జోడీగా సోనాలి బింద్రే (Sonali Bendre) నటించగా కృష్ణవంశీ (Krishna Vamsi)  ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా ఈ సినిమా రీరిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

మురారి సినిమాకు రీరిలీజ్ లో సైతం అదిరిపోయే రెస్పాన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సుధ మురారి రీరిలీజ్ సందర్భంగా మాట్లాడుతూ సూపర్ స్టార్ మహేష్ బాబు అందరూ ఇష్టపడే హీరో అని వెల్లడించారు. కృష్ణ (Krishna) గారితో, మహేష్ బాబుతో నేను నటించానని ఈ హీరోలతో నటించడం చాలా సంతోషాన్ని కలిగించిందని చెప్పుకొచ్చారు. మహేష్ బాబుతో కలిసి మురారితో పాటు వంశీ (Vamsi) , అతడు (Athadu) , దూకుడు (Dookudu) సినిమాలలో నటించానని సుధ వెల్లడించారు.

మురారి సినిమాకు సంబంధించి ఒక సంఘటనను షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు. సినిమాలోని బంగారు కళ్ల బుచ్చమ్మా సాంగ్ లో నేను, మహేష్ సోనాలిని బాగా ఏడిపించామని సుధ పేర్కొన్నారు. షాట్ పూర్తయ్యాక సోనాలి మీరిద్దరూ కావాలనే ఏడిపిస్తున్నారని నాకు అర్థమవుతోందని చెప్పారని సుధ వెల్లడించారు. డేట్స్ సమస్య వల్ల మురారి సినిమాలో కొన్ని సీన్లలో నేను కనిపించాల్సి ఉన్నా కనిపించలేదని సుధ తెలిపారు.

మురారి సినిమాలో ఉన్నంతవరకు షూట్ ఆనందంగా చేశామని సుధ చెప్పుకొచ్చారు. మురారి సినిమా రీరిలీజ్ లో అదిరిపోయే కలెక్షన్లు సాధిస్తే మహేష్ బాబు నటించిన మరికొన్ని సినిమాలు రీరిలీజ్ అయ్యే అవకాశాలు అయితే కచ్చితంగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సుధ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus