సినిమాలు – రాజకీయాలు… ఈ రెండిటి మధ్య విడదీయరాని బంధం ఉంది. అదేంటి? అలా స్టేట్‌మెంట్ ఇచ్చారు ఎవరు చెప్పారు అని అడుగుదాం అనుకుంటున్నారా? చాలా ఏళ్లుగా ఉన్న ఈ మాట రీసెంట్‌గా సీనియర్ నటి సుహాసిని నోట వినిపించింది. దేశంలో రాజకీయాలు లేని సినిమా లేదని ఆమె అభిప్రాయపడ్డారు.దీంతో మరోసారి ఈ టాపిక్ చర్చలోకి వచ్చింది. ఓ నేషనల్ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో సుహాసిని ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. అలాగే తన స్నేహితురాలు రమ్యకృష్ణ గురించి కూడా ఆసక్తికర విషయం చెప్పారు.
భారతీయ సినిమా రంగంలో రాజకీయాలు.. అనే అంశంపై సుహాసిని మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. దాంతోపాటు భర్త మణిరత్నం సినిమాలు, రమ్యకృష్ణతో ఇతర స్నేహితుల ముచ్చట్లు కూడా సుహాసిని చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఆ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కమల్ హాసన్, మణిరత్నం కలసి పని చేయబోతున్న విషయాన్ని సుహాసిని మరోసారి స్పష్టం చేశారు. సుమారు 35 ఏళ్ల తర్వాత ఇద్దరూ కలసి పని చేస్తున్నారని గుర్తు చేశారు.
‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా చేయొద్దని తొలుత తాను మణిరత్నంను కోరినట్లు సుహాసిని చెప్పారు. గతంలో తాము తెరకెక్కించిన రాజకీయ, చారిత్రక సినిమాలు ఇబ్బందికర ఫలితాలు ఇవ్వడంతో ‘పీఎస్’ సినిమాలు వద్దని చెప్పానని.. కానీ ఆ సినిమా కథ మన సంస్కృతిలో ఉందని, అందుకే ప్రజలు ఆ సినిమాలను ఇష్టపడ్డారని చెప్పారు. ప్రస్తుతం ఏం చేస్తారు అనే ప్రశ్నకు… తాను మణిరత్నం భార్య కావడం తనకు ఫుల్ టైమ్ జాబ్ కంటే ఎక్కువని అన్నారు.
అంతేకాదు సినిమాలను ఇప్పుడు చూస్తున్న విధానం గురించి మాట్లాడుతూ… సినిమా చూసేటప్పుడు గూస్ బంప్స్ వస్తే గొప్ప కాదని, ఆ సినిమాలోని విషయాన్ని ఎంజాయ్ చేయగలిగితేనే గొప్ప సినిమా అని అన్నారు. ఈ క్రమంలో తమ తరం హీరోయిన్ల గ్రూపు గురించి సుహాసిని ప్రస్తావించారు. తమ తోటి నటీమణులు అందరూ కలసి ఓ వాట్సప్ గ్రూపు పెట్టుకున్నామని, రమ్యకృష్ణ అర్ధరాత్రి దాటాక ఆ గ్రూపులో చాటింగ్ మొదలుపెడుతుందని నవ్వుతూ చెప్పారు (Suhasini) సుహాసిని.
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు