టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పెళ్లికి సంబంధించి గతంలో అనేక వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఒక స్టార్ హీరోయిన్ తో ప్రభాస్ ప్రేమలో ఉన్నారని, భీమవరంకు చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరగగా ఆ వార్తలు నిజం కాలేదు. ప్రభాస్ త్వరగా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఆయన అభిమానులు సైతం కోరుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వయస్సు 41 సంవత్సరాలు కాగా ప్రభాస్ పెళ్లికి సంబంధించిన తీపికబురు ఎప్పుడు చెబుతారో చూడాల్సి ఉంది.
ప్రభాస్ తో పాటు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ స్టేటస్ అందుకున్న హీరోలు ఇప్పటికే పెళ్లి చేసుకున్నారు. టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన శర్వానంద్ తన తల్లికి ప్రభాస్ అన్న పెళ్లి జరిగిన తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని చెబుతున్నట్టు సమాచారం. ఒక విధంగా శర్వా పెళ్లి ఆలస్యం కావడానికి ప్రభాస్ కారణం కావడంతో పాటు పరోక్షంగా శర్వా పెళ్లికి ప్రభాస్ అడ్డుపడుతున్నారు. శర్వానంద్ స్నేహితురాలు అయిన నటి స్వప్నిక ఒక ఇంటర్వ్యూలో శర్వానంద్ పెళ్లికి సంబంధించిన ప్రశ్నల గురించి స్పందిస్తూ ఈ విషయాలను చెప్పుకొచ్చారు.
అయితే పెళ్లి ఒత్తిడిని తప్పించుకోవాలనే ఉద్దేశంతో శర్వానంద్ ఆ విధంగా చెప్పి ఉండవచ్చని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శర్వానంద్ సిద్దార్థ్ తో కలిసి మహా సముద్రం సినిమాలో నటిస్తుండగా అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాదే ఈ సినిమా రిలీజ్ కానుంది.