సొట్టబుగ్గల సుందరి తాప్సి అంటే ఒకప్పుడు కేవలం కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ పాత్రల్లోనే ఎక్కువగా కనిపించేది. కె.రాఘవేంద్రరావు ఝుమ్మంది నాథం సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ ట్రాక్ లోకి రావడానికి చాలా సమయం పట్టింది. సాధారణంగా ఎవరైనా నటిమణులు టాలీవుడ్ లో సక్సెస్ అయిన తరువాత గాని బాలీవుడ్ కు అంత ఈజీగా వెళ్లలేరు. కానీ తాప్సి లక్కేమిటో గాని ఇక్కడ సక్సెస్ రాకపోయినా కూడా చాలా కూల్ గా బాలీవుడ్ లోకి వెళ్లి పికప్ అయ్యింది.
పింక్ , తప్పడ్, వంటి సినిమాలు నటిగా ఆమె స్థాయిని పెంచాయి. ఇక సినిమాకి 1.5కోట్ల వరకు డిమాండ్ చేస్తున్న ఈ బ్యూటీ కొన్నిసార్లు బడ్జెట్ ను బట్టి చిన్న సినిమాలకు 80లక్షల వరకు తీసుకుంటోంది. ఇక 2019 నాటికి ఆమె నికర ఆదాయం 42.5కోట్లని తెలుస్తోంది. ముంబైలో ఇప్పటికే ఒక లగ్జరి అపార్ట్మెంట్ కూడా ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్, చెన్నైలో కూడా ఆమెకు సొంత ఫ్లాట్స్ ఇల్లులు కూడా ఉన్నాయట.
BMW 5 సిరీస్, మెర్సిడస్ SUV, రేనాట్ కాప్ట్యూర్ వంటి ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. తాప్సి అప్పట్లో పెళ్లికి సిద్ధమైనట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక డానిష్ బ్యాట్మింటన్ ప్లేయర్ మతియాస్ బోతోతో తాప్సి ప్రేమలో ఉన్నట్లు కూడా వార్తలు రాగా అందులో ఎలాంటి నిజం లేదని అమ్మడు కొట్టి పారేసింది. ఇక తాప్సి నుంచి రావాల్సిన సినిమాలు ఇంకా 5 ఉండగా అందులో 3 సినిమాల షూటింగ్స్ పూర్తయ్యాయి.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!