Taapsee: నేను ఎలాంటి తప్పు చేయలేదు.. మీడియాపై తాప్సీ ఆగ్రహం?

ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సొట్టబుగ్గల చిన్నది తాప్సీ ప్రస్తుతం తెలుగు తెరకు దూరమై వరుస బాలీవుడ్ సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె నటించిన శభాష్ మిథుసినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు. అయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోనే తాప్సీ నటించిన దోబారా చిత్రం ఆగస్టు 19 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూకు అటెండ్ కావలసి ఉండగా ఈమె కోసం గంటల సమయం పాటు ఫోటోగ్రాఫర్లు మీడియా ఎదురుచూస్తున్నారు.

ఇలా అనుకున్న సమయం కన్నా కాస్త ఆలస్యంగా వచ్చిన తాప్సీ అక్కడ మీడియా వాళ్ళు ఫోటోల కోసం ఆమెను తాప్సీ మేడం అంటూ గట్టిగా పిలుస్తూ..ఇప్పటికే ఆలస్యంగా వచ్చారు కాస్త ఆగి వెళ్ళండి అంటూ అరిచారు. అయితే ఈమె వారిని పట్టించుకోకుండా లోపలికి వెళ్లిపోయారు. అనంతరం తిరిగి వచ్చి మీడియా పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఆలస్యంగా రాలేదని తన సమయం ప్రకారం తాను వచ్చానని ఈమె మండిపడ్డారు.

తనకోసం మేము రెండు గంటల నుంచి వెయిట్ చేస్తున్నామని మీడియా చెప్పగా ఇందులో నా తప్పు ఏమీ లేదు అంటూ ఈమె సమాధానం చెప్పారు. ఈలోగా వెనక నుంచి కొందరు ఫోటోగ్రాఫర్లు రెండు గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం.. అని అరవడంతో దయచేసి నాతో మర్యాదగా మాట్లాడండి..మీరు నాతో మర్యాదగా మాట్లాడితే నేను కూడా మీతో అలాగే మాట్లాడతాను అంటూ ఏకంగా వారితో వాగ్వాదానికి దిగింది. మొత్తానికి తాప్సీ మీడియాతో ఇలా గొడవ పడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus