బన్నీ చిత్రంతో పాటూ రానా చిత్రంలో నటించబోతున్న టబు ..?

టబు తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినా అప్పటి స్టార్ హీరోలు అందరితోనూ నటించేసింది. చిరంజీవితో ‘అందరివాడు’, బాలకృష్ణ తో ‘చెన్నకేశవ రెడ్డి’ ‘పాండురంగడు’, వెంకటేష్ తో ‘కూలీ నెంబర్ 1’, నాగార్జున తో ‘నిన్నే పెళ్లాడతా’ ‘ఆవిడా మా ఆవిడే’ వంటి చిత్రాల్లో నటించి క్రేజ్ తెచ్చుకుంది. అయితే పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో మళ్ళీ కి వెళ్ళిపోయి చిన్న చిన్న పాత్రలు వేస్తూ ముందుకు సాగుతుంది. ఇదిలా ఉండగా ఇపుడు మళ్ళీ టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యిందట.

ఇప్పటికే బన్నీకి తల్లిగా త్రివిక్రమ్‌ డైరెక్షన్లో రూపొందే చిత్రంలో నటించబోతుందని టాక్ నడుస్తుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో చిత్రంలో కూడా టబు నటించబోతుందట. వివరాల్లోకి వెళితే దగ్గుపాటి రానా చిత్రంలో కూడా టబు కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తుంది. మానవ హక్కుల కార్యకర్తగా ఆమె ఈ చిత్రంలో బలమైన పాత్రలో కనిపించనుందని సమాచారం. ‘విరాటపర్వం 1992’ అనే టైటిల్ ను అనుకుంటున్నారు. దాదాపు 35 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందనుందట.‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus