Star Actress: ఆ విషయం అడగటానికి నువ్వెవరివి : స్టార్ హీరోయిన్

‘శ్రీ’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది తమన్నా. ఆ తరువాత హ్యాపీ డేస్ సినిమాతో యువత క్రేజ్ సంపాదించింది. తన అందచందాలతో కుర్రాళ్ల మతులు పొగొట్టింది ఈ మిల్కీ బ్యూటీ. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన ఈ అమ్మడు నటించింది. దక్షిణాది భాషలతో పాటు, బాలీవుడ్ లోను అనేక చిత్రాల్లో ఆమె నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు పలు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ దూసుకెళ్తోంది.

తాజాగా ఫ్యాన్స్ మీట్ లో పాల్గొన్న ఈ  (Star Actress) అమ్మడు.. అసహనానికి గురైంది. తన తల్లిదండ్రులే ఇలాంటి ప్రశ్నలు వేయలేదంటూ ఫ్యాన్స్ పై అసహనం వ్యక్తం చేసింది. ఇటీవల చెన్నైలో జరిగిన ఫ్యాన్స్ మీట్ లో తమన్నా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన సినిమాలు, వెబ్ సిరీస్ ల గురించి అభిమానులతో ముచ్చటించారు. అలానే వారు అడిగే ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానం ఇచ్చారు. అయితే ఒక ప్రశ్నకు మాత్రం ఆమె ఫ్యాన్స్ పై అసహనం వ్యక్తం చేసింది.

“మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?. తమిళ అబ్బాయిలు మీకు నచ్చలేదా? అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నపై తమన్నా తీవ్ర అసహనానికి లోనయ్యారు. తన తల్లిదండ్రులే ఇలా తనను ఎప్పుడూ అడగలేదని ఈ బ్యూటీ అన్నారు. తన లవర్ విజయ్ వర్మను ఉద్దేశిస్తూ.. ప్రస్తుతం జీవితంలో తాను చాలా సంతోషంగా ఉన్నానని, తన లైఫ్ ఆనందంగా సాగుతుందని తమన్నాచెప్పారు.

ప్రస్తుతం వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ భారీగా సంపాదిస్తోంది. అంతేకాకుండా పలు రకాల బ్రాండ్లకు తమన్నా అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus