సరికొత్త అవతారంలో త్రిష

కరెక్ట్ గా ప్లాన్ చేసుకోకపోతే.. చిత్రసీమలో కథానాయికలకు కొవ్వుత్తుల కంటే వేగంగా వారి కెరీర్ లు కరిగిపోతాయి. కానీ.. కథానాయికగా పదేళ్ళు తెలుగుతోపాటు తమిళ, మలయాళ చిత్రసీమలో నెగ్గుకురావడమే కాకుండా ఇప్పటికీ క్రేజ్ పోగొట్టుకోకుండా అదే మ్యానియాను, ఫిజిక్ నూ మెయింటైన్ చేస్తోంది. అయితే.. అమ్మడు ఇప్పుడు సరికొత్త అవతారమెత్తనుంది. సరికొత్త అవతారం అనగానే ఏదైనా సినిమా కోసం కొత్త తరహా పాత్ర పోషిస్తుందనుకొనేరు.. అమ్మాయిగారు నిర్మాతగా మారుతున్నారు.

ఓ తమిళ యువ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఆ చిత్రాన్ని తానే నిర్మించి హీరోయిన్ గా కూడా నటిస్తానని ప్రామిస్ చేసిందట. ప్రామిస్ తోపాటు తన మేనేజర్ ద్వారా తమిళ మీడియాకి ప్రెస్ నోట్ కూడా వదిలింది. దాంతో ఇప్పుడు త్రిష ప్రొడ్యూసర్ అయ్యిందన్న విషయం తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. “పరమపధం” అనే టైటిల్ కూడా రిజిష్టర్ చేయించేసిందని.. త్వరలోనే ఈ సినిమా సెట్స్ కు వెళ్లనుందని తెలుస్తోంది. ఇకపోతే.. త్రిష కథానాయికగా నటిస్తున్న “మోహినీ” మార్చిలో విడుదలకానుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus