Actress: తాగేసి నటిని ఘోరంగా వేధించాడట..!

‘బిగ్ బాస్’ ద్వారా పాపులర్ అయిన వారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు హౌస్ నుండి బయటకి వచ్చాక ఏదో ఒక రకంగా బిజీ అయ్యారు. వారిలో ఉర్ఫీ జావెద్ కూడా ఒకరు. బిగ్ బాస్ హిందీ ఓటీటీ మొదటి సీజన్ ద్వారా ఉర్ఫీ పాపులర్ అయ్యింది. అయితే హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఈమె విచిత్రమైన దుస్తుల్లో కనిపిస్తూ రచ్చ చేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఈమె ధరించే దుస్తులు అస్లీలతని ప్రోత్సహించే విధంగా ఉంటాయి అనడంలో సందేహం లేదు.

తాజాగా ఈ బ్యూటీ వేధింపులకు గురైనట్టు సమాచారం. గురువారం సాయంత్రం ఆమె ముంబై నుంచి గోవా ఫ్లైట్ లో ప్రయాణిస్తుండగా మ‌ద్యం మ‌త్తులో ఉన్న ఓ వ్య‌క్తి ఆమెను టీజ్ చేయడం మొదలుపెట్టాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే తెలిపింది. ‘నాపై కొంద‌రు ఈవ్ టీజింగ్ కి పాల్పడ్డారు. ముంబై నుండి గోవా వెళ్తుండ‌గా నాకు ఈ చేదు అనుభవం ఎదురైంది.

నన్ను ఈవ్ టీజింగ్ చేస్తూ, నా పేరుతో అసభ్యంగా పిలుస్తూ చాలా ఏడిపించారు. నేను అతనితో వాదనకి దిగ‌డంతో నా స్నేహితుడు మ‌ద్యం తాగి ఉన్నాడ‌ని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు. కంట్రోల్ చేసుకోలేనంతగా తాగి ఇలా మ‌హిళ‌ల‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డాన్ని క్ష‌మించ‌లేము. నేను పబ్లిక్ ఫిగ‌ర్‌నే అయినా ప‌బ్లిక్ ప్రాప‌ర్టీని కాదు.’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

తప్పు ఎవరిదైనా నెటిజెన్ల అక్షింతలు మాత్రం ఉర్ఫీకే పడుతున్నాయి.సరైన డ్రెస్సింగ్ ఉంటే ఇలాంటి అనుభవాలు ఎదురవ్వవు.. అంటూ నెటిజన్లు కూడా ఈమె (Actress) పై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus