Vanitha Vijaykumar: తమిళనాడులో కాలు కూడా పెట్టలేవని బెదిరించారు!

  • May 26, 2023 / 08:57 PM IST

చాలాకాలం తర్వాత మళ్లీ పెళ్లి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు నటి వనిత విజయ్ కుమార్. ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాషలో కలిసి సినిమాలలో నటించి మెప్పించిన ఈమె కొంతకాలం పాటు తన వ్యక్తిగత కారణాల వల్ల సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే నరేష్ పవిత్ర లోకేష్ నటించిన మళ్లీ పెళ్లి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా నేడు విడుదల అయింది.

ఈ సినిమాలో వనిత విజయ్ కుమార్ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పాత్రలో నటించారు. ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వనిత విజయ్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వనిత విజయ్ కుమార్ తన ఫ్యామిలీ నుంచి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు అంటూ ఈ సందర్భంగా మరోసారి తన ఫ్యామిలీ తనకు చేసిన అన్యాయం గురించి ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ సందర్భంగా ఈమె (Vanitha Vijaykumar) మాట్లాడుతూ తన కుటుంబ సభ్యులు తనను వేరుగా చూశారని. తన తల్లికి తానంటే చాలా ఇష్టమనీ వనిత విజయ్ కుమార్ తెలిపారు. ఒకానొక సమయంలో కుటుంబ సభ్యులే బెదిరించారని తెలిపారు. ఈ గొడవలన్నింటికి ఆస్తి తగాదాలే కారణమని వనిత తెలిపారు. ఆస్తి కోసమే తనని ఇంటి నుంచి బయటకు పంపించారని తెలిపారు.అప్పుడు ఎక్కడికి వెళ్లాలలో అర్థం కాలేదని.. ఆ సమయంలో పిల్లలను తీసుకుని పొరుగు రాష్ట్రంలో తల దాచుకున్నానంటోంది.

కర్ణాటకలో రెండు సంవత్సరాలు పాటు పిల్లలతో కలిసి ఉన్నానని ఆ సమయంలో తన తండ్రికి ఫోన్ చేస్తే తనని తమిళనాడులో అడుగు కూడా పెట్టనివ్వనని బెదిరించాడు అంటూ ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు. ఇప్పుడు తమిళనాడు ప్రజలు తనని తమ బిడ్డగా చూసుకుంటున్నారని ఈ సందర్భంగా వనిత విజయ్ కుమార్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వనిత విజయ్ కుమార్ కూడా మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భర్తలకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus