నటి హరిప్రియ.. నటుడు వశిష్ట ఎన్. సింహాతో ఏడడుగులు వెయ్యడానికి రెడీ అయిపోయారు.. శనివారం (డిసెంబర్ 3) వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని కాబోయే వధూవరులను బ్లెస్ చేశారు. దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లోనూ దుబాయ్‌లో తీసుకున్న పిక్ షేర్ చేశారు. కన్నడలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న హరిప్రియ.. హీరోయిన్ భూమిక నిర్మించిన ‘తకిట తకిట’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది..
‘పిల్ల జమీందార్’, ‘అబ్బాయి క్లాస్.. అమ్మాయి మాస్’, ‘ఈ వర్షం సాక్షిగా’, బాలయ్య ‘జై సింహా’ చిత్రాలతో ఆకట్టుకుంది. మలయాళంలోనూ నటించింది. ఇక వశిష్ట.. ‘కె.జి.యఫ్’ లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి బ్రదర్ కమల్ క్యారెక్టర్ చేశాడు. తెలుగులో వెెంకటేష ‘నారప్ప’ లోనూ నటించాడు.. కన్నడలో గుర్తింపు తెచ్చుకున్న వశిష్ట, కొద్ది కాలంగా హరిప్రియతో ప్రేమలో ఉన్నాడు. మీడియాకి కానీ, ఇండస్ట్రీ వర్గాల వారికి కానీ ఎలాంటి అనుమానం రాకుండా..
చాలా సీక్రెట్‌గా రిలేషన్ షిప్ కంటిన్యూ చేస్తూ వచ్చిన ఈ జంట.. రీసెంట్గా బెంగుళూరు విమానాశ్రయంలో కెమెరాల కంటపడ్డారు. ఇద్దరూ చేతిలో చేయి వేసుకుని వెళ్తున్న పిక్స్ నెట్టింట వైరల్ అవడం చూశాం..