అప్పటివరకు కనీసం ఓటర్ మొఖాన్ని కూడా చూసి ఎరుగని పొలిటీషియన్.. ఎలక్షన్స్ వచ్చేసరికి చెంబుతో అదే ఓటర్ ముడ్డి కడగడానికి రెడీ అయిపోయినట్లు. ఆఫర్లు తగ్గుతున్నాయేమో అనే డౌట్ రాగానే హీరోయిన్లు బికినీల్లో, కురుచ దుస్తుల్లో దర్శనమిస్తుంటారు. టాలీవుడ్ లో ఇప్పుడు టాప్ స్టార్లుగా అలరారుతున్న, ఒకప్పుడు అలరారిన చాలామంది హీరోయిన్లు ఈ జాబితాకు చెందినవారే. ఇప్పుడు ఈ జాబితాలో లేటెస్ట్ ఎంట్రీ ఇచ్చింది అందాల భామ వేదిక.
ముని సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వేదిక అనంతరం పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. ఆశించిన స్థాయి స్టార్ డమ్ సంపాదించుకోలేకపోయింది. దాంతో మెలమెల్లగా కనబడకుండాపోయింది. మళ్ళీ బాలయ్య సరసన రూలర్ చిత్రంలో కనిపించినప్పటికీ.. ఆ సినిమాను కానీ, ఆమెను కానీ జనాలు కనీస స్థాయిలో కూడా పట్టించుకోలేదు. మధ్యలో బాలీవుడ్ లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకొంది. కాస్త తెగించి ఇమ్రాన్ హష్మీతో ముద్దు సీన్లలో నటించినప్పటికీ.. పెద్దగా ఫలితం లేకపోయింది. దాంతో మళ్ళీ సౌత్ లోనే సినిమా ప్రయత్నాలు మొదలెట్టింది.
అయితే.. ఇప్పటికే పాప చాలా ఓల్డ్ అయిపోవడం, కొత్త హీరోయిన్లు కోకొల్లలుగా వచ్చేస్తుండడంతో ఆమెను పట్టించుకొనే నాధుడు లేకుండాపోయాడు. దాంతో ఇలా ముడుచుకుని కూర్చుంటే పనవ్వదని గ్రహించి.. అర్జెంట్ గా బికినీ వేసేసుకొని ఒక ఫోటోషూట్ చేయించేసుకోంది. బంగారు రంగు బికినీలో.. బంగారు మేనితో బీచ్ లో వయ్యారాలు ఒలకబోస్తున్న వేదిక ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.