గ్యారేజ్ లో మరో హీరోయిన్!

కొరటాల శివ, ఎన్‌టి‌ఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘జనతా గ్యారేజ్’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సమంత, నిత్యమీనన్ లు ఈ సినిమాలో హీరోయిన్స్ గా కనిపించనున్నారు. మోహన్ లాల్ ఓ ముఖ్యమైన పాత్రలో మెరవనున్నారు. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ చేరిందని తెలుస్తోంది. గతంలో అల్లరి నరేశ్ సరసన ‘అత్తిలి సత్తిబాబు’ వంటి చిత్రంలో మెరిసింది నటి విదీశ. ఆ తరువాత దేవరాయ అనే మరో సినిమాలో నటించింది.

అయితే ఈ రెండు సినిమాలో ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, మళ్లీ తెలుగులో ఎటువంటి అవకాశాలు దక్కలేదు. అయితే ‘జనతా గ్యారేజ్’ సినిమాలో విదీశ నటించనుందని గతంలో వార్తలు హల్ చల్ చేశాయి. ఇప్పుడు ఆ వార్తల్లో నిజముందని తేలింది. ఈ సినిమా షూటింగ్ లో విదీశ పాల్గొన్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాలో విదీశకు కొరటాల ఎలాంటి పాత్రను ఆఫర్ చేశాడో..? ఈ సినిమాతో అయినా.. ఈ భామ జాతకం మారుతుందేమో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus