అనిల్ రావిపూడి కి విజయశాంతి మరో బంపర్ ఆఫర్?

13 ఏళ్ళ తరువాత మళ్ళీ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ లెక్చరర్ గా కనిపించబోతుంది విజయశాంతి. అయితే కథ ప్రకారం మేజర్ పార్ట్ ను కర్నూల్ లో తీయాల్సి ఉందట. అయితే మొదట విజయశాంతి అందుకు అంగీకరించలేనని. మరొకరిని చూసుకోమని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పిందట. అయితే ఈ విషయం పై నిర్మాతలతో డిస్కస్ చేసిన అనిల్ … హైదరాబాద్ లోనే కర్నూల్ వాతావరణాన్ని తీసుకువద్దామని సూచించాడట. దీనికి నిర్మాతలతో పాటు విజయశాంతి కూడా అంగీకరించడంతో ఈ పాత్ర చేయడానికి ఒప్పుకుందని తెలుస్తుంది.

30 ఎకరాలలో సెట్లు వేసి… హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే మేజర్ పార్ట్ మొత్తం చిత్రీకరిస్తున్నారని తెలుస్తుంది. పచ్చని పొలాలు, ఇళ్ళు, వంటి వాటితో ‘సరిలేరు నీకెవ్వరు’ సెట్స్ అదిరిపోతున్నాయని తెలుస్తుంది. అనిల్ రావిపూడి డెడికేషన్ మరియు వినయానికి విజయశాంతి ఫిదా అయిపోయిందట. నటీనటులకి ఇంత ప్రాధాన్యత ఇస్తూ.. వస్తున్న అనిల్ తరువాత చిత్రమైన ‘ఎఫ్3’ కి కూడా ఈమె సైన్ చేసినట్టు సమాచారం. ఏమైనా రాములమ్మ ను ఇంప్రెస్ చేయడంలో అనిల్ రావిపూడి సక్సెస్ సాధించాడు. మరి సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి..!

‘సైరా’ నరసింహారెడ్డి లో ఆకర్షించే అంశాలు ఇవే!
‘బిగ్ బాస్ 3’ హౌస్ మేట్స్ ను సినిమా పోస్టర్లతో పోలిస్తే?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus