స్టార్ హీరోలే కాదు సీనియర్ హీరోయిన్లు కూడా పోటీ పడుతున్నారు..!

సంక్రాంతికి మహేష్ బాబు… అల్లు అర్జున్ ల సినిమాలు పోటీ పడుతోన్న సంగతి తెలిసిందే. వీళ్ళు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అలా వైకుంఠపురములో’ సినిమాలు ఒకే రోజున విడుదల కాబోతున్నాయి. అయితే ఈ సినిమాలతో కేవలం హీరోలకు మాత్రమే కాదు ఇద్దరు సీనియర్ హీరోయిన్లకు కూడా పోటీ ఏర్పడేలా ఉంది. ఆ ఇద్దరు సీనియర్ హీరోయిన్లు ఎవరో ఈపాటికే మీకు తెలిసిపోయి ఉంటుంది. వాళ్ళే నండీ.. విజయశాంతి,టబు.

చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి స్టార్ హీరోలందరితోనూ ఈ భామలు నటించేసారు. ప్రస్తుతం విజయశాంతి రాజకీయాల్లో బిజీగా ఉండడంతో సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇక టబు మాత్రం హిందీ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా అంటూ వస్తున్నారు. అయితే చాలా కాలం తర్వాత వీరిద్దరికీ ఇవి రీ ఎంట్రీ సినిమాలని చెప్పొచ్చు. ‘సరిలేరు నీకెవ్వరు’ లో విజయశాంతి పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ గా కనిపిస్తారట. ఇక ‘అల వైకుంఠపురములో’ సినిమాలో టబు కూడా చాలా ప్రాముఖ్యత ఉన్న గృహిణి పాత్రలో కనిపించబోతుందట. మరి వీరిద్దరిలో సంక్రాంతికి గెలిచేదెవరో చూడాలి..!

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus